రాహుల్ తో పెళ్లి వార్తలపై స్పందిచిన అధితీ సింగ్

వాట్సప్ , ఫేస్ బుక్ ల లాంటి సమాజిక వేదికల ద్వారా ప్రచారం అవుతున్న అవాస్తవాలకు అంతూపొంతూ లేకుండా ఉంది. అది పక్కన పెడితే మహిళలను బజారుకీడ్చేందుకు కూడా ఈ సామాజిక మాధ్యమాలు వేదికలుగా ఉపయోగపడుతున్నాయి. ఎదుటి వారిపై బురద చల్లేందుకు వ్యక్తిగత విమర్శలు చేయడం ఇప్పుడు మామూలయిపోయింది. అది కూడా దాటిపోయి మహిళలను కూడా ఈ రొంపిలోకి లాగుతున్నారు. యువతులు, మహిళలనే కనీస ఇంకిత జ్ఞానం లేకుండా సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం మరీ శృతిమించుతోంది. ఉత్తర్ ప్రదేశ్ ఎమ్మెల్యే అధితీ సింగ్ పై జరిగిన ప్రచారం ఇందుకు చక్కని ఉదాహరణ.
తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పై సాగిన ప్రచారం పై ఆమె వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోబోతున్నాడని త్వరలోనే ఆయన విహాహం జరుగుతుందని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ప్రచారం జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అధితీ సింగ్ ను రాహుల్ వివాహం చేసుకుంటారనే ప్రచారం జోరుగా సాగింది. దీనితో పాటుగా వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోను కూడా షేర్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్ గా మారింది.
దీనిపై స్పందించిన అదితీసింగ్ తాను రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోబోతున్నట్టు వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని కొట్టిపారేసింది. ఇది పూర్తిగా అవాస్తవమని ఆమె తేల్చిచెప్పింది. రాహుల్ గాంధీని తాను సోదరుడిగా భావిస్తానని ఆయన తనకు రాఖీ సోదరుడని ఆమె చెప్పింది. ఇటువంటి ప్రచారాలు జరగడం పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తమ పార్టీకి చెందిన నాయకుడితో తాను ఫొటో దిగడం తప్పా అంటూ అమె ప్రశ్నించింది.
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన అదితీ సింగ్ రాహుల్ గాంధీ కుటుంబానికి సన్నిహితురాలిగా పేరుంది. రాహుల్ సోదరి ప్రియాంక తో అతిధి కి మంచి సంబంధాలు ఉన్నాయి. ఉన్నత విద్యావంతురాలైన అతిదీ సింగ్ యూపీ రాజకీయాల్లో చురుకైన పాత్రను పోషిస్తున్నారు. కాంగ్రెస్ కు ఉన యువ నేతల్లో ఆమెకూడా ఒకరు. ప్రస్తుతం తన నియోజకవర్గంలో గట్టి పట్టు సంపాదిస్తున్న అతిదీ సింగ్ రాజకీయాల్లో దూసుకునిపోతుండడంతో ఆమె వ్యతిరేకులు ఇటువంటి ప్రచారాలను మొదలు పెట్టారు.
రాహుల్ గాంధీతో అతిధీ సింగ్ వివాహం నిశ్చయం అయిపోయిందని రెండు కుటుంబాల మధ్య మాటలు కూడా పూర్తయినట్టు వార్తలను పుట్టించగా కొంత మంది ఇంకో అడుగు ముందుకేశారు. రాహుల్ గాంధీతో అదితీ సింగ్ చెట్టాపాట్టాలు వేసుకుని తిరుగుతున్నారనే ప్రచారం చేశారు. దీనిని ఆమె తీవ్రంగా ఖండించింది. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం ఇప్పటికైనా ఆపాలంటూ ఆమె వేడుకోవాల్సి వచ్చింది.
రాజకీయ ప్రత్యర్థులను దెబ్బకొట్టడం కోసం సామాజిక మాధ్యమాలను వాడుకోవడం, వారిపై వ్యతిరేక ప్రచారాలు చేయడం మామూలుగా మారిపోయింది.
సహేతుక విమర్శలు చేయడం, తమకు అనుకూలంగా ఉన్న నేతలకు మద్దతుగా ప్రచారం చేయడంలో ఎవరీకీ ఎటువంటి అభ్యంతరం ఉండకపోవచ్చు కానీ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు తప్పుడు ప్రచారాలు చేయడం అందుకు మహిళలను పావుగా వాడుకోవడం మాత్రం సరైంది కాదు. ఈ తరహా చర్యలకు ఏ రాజకీయ పార్టీ అతీతం కాదు.
Aditi singh , congress party, congress, rahul gandhi, rahul gandhi marriage, rahul gandhi aditi singh, utter pradesh, utter pradesh congress, priyanka gandhi, priyanka, rahul gandhi marriage news, rahul marriage news, rahul.

encounter


flayover
Aditi_Singh
Indian_National_Congress