మోడుబారుతున్న ఆదిలాబాద్ అడవులు…

ఎటుచూసినా దట్టమైన అడవులు…పక్షుల కిలకిలారావాలు…అరుదైన జంతు సంపద… ఇదీ పూర్వపు ఆదిలాబాద్ జిల్లా నేపధ్యం. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అడవులు అంతరిస్తున్నాయి.. పక్షుల గొంతు మూగపోయింది…జంతువులు కనుమరుగు అవుతున్నాయి. పూర్వపు ఆదిలాబాద్ జిల్లాల్లో అండవుల నరికివేత యద్ధేచ్చగా జరిగిపోతోంది. వందల అడుగుల చెట్లు క్షణాల్లో నేరకూలుతున్నాయి. అడవి దొంగలు రెచ్చిపోతున్నారు. దీనితో అడవులు బోసిపోతున్నాయి.
పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలోని గుండాల, కేశవపట్నం,ఎల్లమ్మగూడ,జోగిపేటల్లో అడవులు వేగంగా అంతరిస్తున్నాయి. టేకు ను దొంగచాడుగా స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలు పెచ్చమీరుతున్నాయి. దీనితో పాటుగా వంటచెరుకు కోసం కూడా అడవులను విచ్చలవిడిగా నరికివేస్తున్నారు. ఇంతరజురుగుతున్నా అటవీ శాఖ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకుంది. అడవులను నరికే వాళ్లని అడ్డుకోవడం అటవీశాఖ సిబ్బంది చేత కావడం లేదు. సిబ్బంది, ఆయుధాల కొరత వల్ల అడవులను నాశనం చేస్తున్నా చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామని సిబ్బంది వాపోతున్నారు. అడవులను నరికే వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే తమపైనే దాడులకు తెగబడుతున్నారని వారు చెప్తున్నారు.
అడవి దొంగల చేతిలో ప్రాణాలు కోల్పోయిన దాఖలాలు కూడా అనేకం ఉన్నాయి. చెట్లను నరికివేసిన తరువాత కలపను స్వాధీనం చేసుకోవడం మినహా చెట్లను కొట్టే సమయంలో వాళ్లను అడ్డుకునే పరిస్థితులు లేవని అటవీ సిబ్బందే చెప్తున్నారు. చెట్లను కొట్టేవారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రాణాలు తీసేందుకు కూడా వారు వెనకాడడం లేదని సిబ్బంది వాపోతున్నారు.
అటవీ శాఖ నిస్సహాయతను ఆసరాగా చేసుకుని స్మగ్లర్లు మరింత రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారం అడవులను నరికివేస్తున్నారు. పంట చెరుకును విచ్చలవిడిగా తలిస్తున్నారు. ఒక లోడు వంటచెరుకు ధర ఐదు నుండి ఏడువేల రూపాయల వరకు ఉండడంతో అడవులను నరికి వంటచెరుకును హాస్టళ్లకు, ఫంక్షన్ హాళ్లకు సరఫరా చేస్తున్నారు. గ్యాస్ ధరతో పోలిస్తే వంట చెరుకు తక్కువ ధరకు దొరకడంతో చాలాంది దీనివైపే మొగ్గుచూపుతున్నారు.
అడవులను ఇష్టం వచ్చినట్టు నరకివేస్తుండడంతో రానున్న రోజుల్లో అడవుల జిల్లాగా పేరుగాంచిన పూర్వపు ఆదిలాబాద్ మైదానంగా మారడం ఖాయమనే ఆందోలనలు వ్యక్తమవుతున్నాయి.