ఐఐటీ సమీపంలో ఘోర ప్రమాదం 5గురు మృతి

హైదరాబాద్ ఐఐటి వల్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సంగారెడ్డి పట్టణానికి ఐదుగురు రుద్రారంలో జరుగుతున్న హోళీ ఈవెంట్ కు సంబంధించిన పనులను చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. వేగం వల్ల కారుపై నియంత్రణ కోల్పోవడంతో కారు డివైడర్ ను దాటుకుని రోడ్డుకు అటువైపు వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. కార్లో ఉన్న బెలూన్లు తెరుచుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని దీన్ని బట్టి కారు ఎంత వేగంతో దూసుకుని పోతోందో తెలుస్తోందని పోలీసులు అంటున్నారు.
మృతులను ప్లెక్సీల వ్యాపారం నిర్వహించే బాశెట్టి మహేష్ (28), ఇదే సంస్థలో పనిచేసే వెంకట్ రాంరెడ్డి (24), సీసీ కెమేరాల వ్యాపారం నిర్వహించే ఎల్లుగారి వెంకటేశ్వర్ రెడ్డి (28), న్యాత నాగరాజు (20), కిరాణా దుకాణం నిర్వహించే నరేందర్ చారి (30) గా గుర్తించారు. వీరిలో చారి మినహా మిగతావారంతా అవివాహితులే. వీరంతా బాశెట్టి మహేష్ కు చెందిన కారులో రుద్రాంకు వెళ్లినట్టు పోలీసులు చెప్తున్నారు. అక్కడ హోళీ సందర్భంగా నిర్వహిస్తున్న ఈవెంట్‌లో ఫ్లెక్సీలు బిగించడంతో పాటు ఇతరత్రా పనులు చేసిన అనంతరం వీరు సంగారెడ్డి పట్టణానికి వస్తుండగా ఈ దుర్ఘాటన జరిగింది.
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 5గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సులోని వాళ్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారని ప్రత్యక సాక్షులు చెప్తున్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *