వీటికి ఆధార్ కార్డు తప్పని సరి

ఆధార్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆధార్ కార్డు రాజ్యాంగ బద్దతపై తలెత్తిన ప్రశ్నలకు కోర్టు కొట్టివేసింది. ఈ జాతీయ కార్టు చట్టబద్దతను ప్రశ్నించడానికి వీల్లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అదే సమయంలో వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయంలోనూ కోర్టు కొన్న సూచనలు చేసింది. ఆధార్ చట్టంలోని సెక్షన్ 57ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీని వల్ల ప్రైవేటు సంస్థలు ఆధార్ కు సంబంధించిన వివరాలు అడగడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఆధార రాజ్యాంగ బద్దమే అయినప్పటికీ సమాచార సంరక్షణకు చట్టాలు తీసుకోవాలని రావాల్సిన అవసర ఉందని చెప్పింది. ఈ జాతీయ గుర్తింపు కార్డును అక్రమంగా భారత్ లోక్ ప్రవేశించిన వారు పొందకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
పాన్ కార్డును పొందడానికి, ఇన్ కం ట్యాక్స్ రిటర్న్ దాఖలుకు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది, సబ్సీడీలు పొందడానికి, ఆధార్ కార్డులు అవసరం అని కోర్టు పేర్కొంది. అదే సమయంలో బ్యాంకు ఖాతాలకు, టెలికాం సేవలకు, మెబైల్ నెంబర్లతో అనుసంధానానికి, పాఠశాలల ప్రవేశానికి ఆధార్ కార్డు అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.
aadhar card, supreme court on aadhar card.

On that day …