చోటా నయూం ఈ అయూభ్ ఖాన్

ముంబాయిలో నగర పోలీసులు అరెస్టు చేసిన కరడుగట్టిన నేరగాడు అయూభ్ ఖాన్ నేరాల చిట్టా చిన్నదేం కాదు. పాతబస్తీలో పేరుమోసిన రౌడీషీటర్ అయూభ్ ఖాన్ అలియాస్ పఠాన్ పాతనగరంలో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. చిన్న తనం నుండే నేరాలకు అలవాటు పడ్డ అయూభ్ ఖాన్ తన 16వ ఏటి నుండే నేరాలను చేయడం ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 6 హత్యలు, 8 హత్యా ప్రయత్నాలతో పాటుగా టాడా కేసులు, అక్రమ ఆయుధాల కేసులు, దోపిడిల కేసులు ఇతగాడిపై చాలానే ఉన్నాయి. మొత్తం 72 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఈ నేరగాడికి వ్యతిరేకంగా సాక్షం చెప్పేందుకు ఎవరూ ముందుకు రానీయకుండా చేయడం ఇతని నైజం. దీనితో 72 కేసులకు గాను కేవలం రెండు కేసుల్లోనే కోర్టు శిక్షవేయగలిగింది. సరైన సాక్షాలు లేని కారణంగా మిగతా కేసులను కోర్టు కొట్టివేసింది.

 • ఇతనిపై నమోదైన కేసులు 72 కాగా అసలు పోలీసుల దృష్టికి రాని కేసులు వందల సంఖ్యలో ఉన్నాయి.
 • బాధితులపై బెదిరింపులకు దిగడంతో పోలీసులను ఆశ్రయించకుండా ఉండిపోయిన వారే ఎక్కువ.
 • బెదిరింపులు, దాడులతో హడలెత్తించే అయూభ్ ఖాన్ నేరసామ్రాజ్యం చిన్నదేం కాదు..
 • పోలీసులపైనే దాడులు చేసిన చరిత్ర అయూభ్ ఖాన్ ది.
 • పాతబస్తీని గడగడ లాడించే స్థాయికి చేరుకున్న అయూబ్
 • రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో కోట్లు కూడబెట్టిన అయూబ్
 • హైదరాబాద్ నుండి మకాం మార్చి అనుచరులతో పనులు చేయిస్తున్న నేరగాడు.
 • ఇతని తండ్రి సైన్యంలో పనిచేశారు.
 • చిన్నా చితకా పనులు చేసిన అయూబ్ క్రమంగా నేరాల వైపు మళ్లాడు.
 • రాజకీయ అండదండలతో ఎదిగిన అయూబ్
 • హుస్సేనీ ఆలంలో ఈ రౌడీని అర్థనగ్నంగా ఊరేగించిన పోలీసులు
 • 1992లో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కత్తితో వారిపై దాడి చేశాడు.
 • మరో రౌడీషీటర్‌ మహ్మద్‌ కైసర్‌(39) అలియాస్‌ మల్లేపల్లి కైసర్‌ అలియాస్‌ ఘోరా కైసర్‌తో శత్రుత్వం
 • 2007 జనవరి 19న శాలిబండ ఠాణా సమీపంలో తనను పట్టుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు.
 •   హైదరాబాద్‌ పోలీసులు పీడీ చట్టం ప్రయోగిస్తుండటం.. శత్రువుల నుంచి ప్రాణహాని ఉండటంతో దుబాయ్‌ పారిపోయాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *