అతనో కమేడియన్… ప్రేక్షకుల మన్నలను పొంది ప్రస్తుతం హీరోగా ప్రమోట్ అయ్యాడు…సినిమాను ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తున్నారు… కొద్ది కాలంలోనే కమేడియన్ గా ప్రేక్షకుల గుర్తింపు పొంది హీరోగా మారిన సప్తగిరి తనపై కొన్ని వెబ్ సైట్లు చేస్తున్న ప్రచారం పట్ల ఆవేదన చెందుతున్నాడు. తాను కష్టపడి తీసిన సినిమా పై కొందరు లోనిపోని రాతలు రాస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. సప్పగిరి హీరోగా నటించిన “సప్తగిరి ఎక్స్ ప్రెస్” సినిమా భారీ హిట్ కాకున్నా ప్రేక్షకుల ఆదరణ మాత్రం పొందింది. అయితే తనపై, సినిమా పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని హీరో బాధపడుతున్నాడు. నాలాంటి హీరోని ప్రోత్సహించాల్సింది పోయి అబద్దపు రాతలతో దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు. ఒక పక్క సినిమా బాగా ఆడుతోందని సంతోషంగా ఉన్నా తనపై రాస్తున్న రాతల పట్ల పాపం ఈ హీరో మనస్థాపం చెందుతున్నాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్ యూనిట్ పెట్టిన ప్రెస్ మీట్ లో ఈ హోరాగారు ఏకంగా కంటతడి పెట్టాడు. దీనిపై తరువాత ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ సినిమాను గురించి కొంతమంది పనిగట్టుకుని చేస్తున్న నెగిటివ్ ప్రచారం తనను బాధించిందని చెప్పాడు. అందుకో ప్రెస్ మీట్ లో కండతడి పెట్టాల్సి వచ్చిందన్నారు.
తమ సినిమా బి,సి సెంటర్లలో మంచి వసూళ్లు సాధిస్తోందని చెప్పాడు. ఈ సినిమా కోసం తాను చాలా కష్టపడి పనిచేశానని చెప్పారు. కొన్ని సమీక్షలు సినిమాకు వ్యతిరేకంగా వచ్చినా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు సప్తగిరి కృతజ్ఞతలు చెప్పాడు. తన సినిమాను గురించి గొప్పగా రాయమని తాను కోరుకోవడం లేదని ఉన్నది ఉన్నట్టు రాస్తే సరిపోతుందని అన్నాడు.