మరో కరడుగట్టిన నేరగాడిని హైదరాబాద్ పోలీసుు అదుపులోకి తీసుకున్నారు. ముంబాయిలో అరెస్టు చేసిన గ్యాంగ్ స్టర్ అయూబ్ ఖాన్ ను పోలీసులు మీడియా ముందుకు తీసుకుని వచ్చారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన అతడిపై పలు హత్యాయత్నం కేసులతో పాటు, బెదిరించి డబ్బులు గుంజుకోవడం వంటి కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. నకిలీ పాస్‌పోర్టు ఆధారంగా ముంబై ఇమ్మిగ్రేషన్ అధికారులు అయూబ్‌ను గుర్తించి హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారన్నారు. గతంలోనూ ఇతడిపై ఓ నకిలీ పాస్‌పోర్టు కేసు నమోదు అయినట్లు డీసీపీ చెప్పారు. అయుబ్ గ్యాంగ్‌లోని మిగతా వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నారు.బలవంతపు వసూళ్లు, పలు హత్యల్లో అయుబ్పై కేసులు ఉన్నాయి. అయూబ్‌పై 22 భూ ఆక్రమణ, ఎనిమిది హత్యలతో పాటు మొత్తం 72 కేసుల్లో నిందితు. పేరుమోసిన నేరగడా నయీం ఎన్ కౌంటర్ తరువాత హైదరాబాద్ లోని నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం ప్రకటించిన తరువాత అయూబ్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు.