అదేమన్నా నా సొంత ఇల్లా:కేసీఆర్

ముఖ్యమంత్రి అధికార నివాసం పై కొంత మంది చేస్తున్న వ్యాఖ్యలు బాధకలిగించాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి నిత్యం వందాలాది మందితో మాట్లాడాల్సి ఉంటుందని అధికారులతో సమావేశాలను నిర్వహించాల్సి ఉంటుందని వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకునే కొత్త ఇంటి నిర్మాణం పూర్తిచేశామని కేసీఆర్ చెప్పారు. ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా ముఖ్యమంత్రి అధికార నివాసంలో 150 గదులు ఏమైనా ఉన్నాయా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. గతంలో వైఎస్ హయాంలో నిర్మించిన క్యాంపు కార్యాలయంలో పార్కింగ్ సమస్య చాలా ఎక్కువగా ఉందని సీఎం చెప్పారు. ఒక్క సీఎం వాహనాలకు తప్పితే మరెవరి వాహనాలకు పార్కింగ్ సదుపాయం లేదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే కొత్త క్యాంపు కార్యాలయ నిర్మాణం జరిపినట్టు కేసీఆర్ వెళ్లడించారు. కొత్తగా నిర్మించిన భవనం తన సొంతమా అని కేసీఆర్ ప్రశ్నించారు. అది ప్రజల ఆస్తి అని అన్నారు. విపక్షాలు ప్రతీ దాన్ని నిగిటివ్ దృష్టితో చూడవద్దని హితవు పలికారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. శరవేగంతో పనులు జరుగుతున్న విషయాన్ని గమనించాలన్నారు. హైదరాబాద్ లో ఇళ్ల నిర్మాణానికి 650 ఎకరాలు కేటాయించినట్టు సీఎం చెప్పారు.
త్వరలోనే విపక్షనేత జానారెడ్డి ఇంటికి భోజనానికి వెళ్తానని సీఎం  చెప్పారు. ప్రతిపక్షనేత ఇంటికి ముఖ్యమంత్రి భోజనానికి వెళ్లే మంచి సంప్రదాయం గతంలో ఉండేదని అటువంటి సంప్రదాయాన్ని తిరిగి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నానని తనకు జానారెడ్డి ఇంటికి భోజనానికి వెళ్లాలని ఉన్నట్టు కేసీఆర్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *