ఉరికేసు హైకోర్టుకు-త్వరలో విచారణ

దిల్ షుఖ్ నగర్ లో బాంబు పేలుడు కేసులో ఉరిశిక్ష పడ్డ దోషులు శిక్షను సవాలు చేస్తూ హై కోర్టును ఆశ్రయించారు.  పేలుళ్లకు పాల్పడి 19 మంది మరణానికి 130 మంది గాయపడ్డానికి కారణమైన ఐదుగురు ఉగ్రవాదులకు ఎన్ఐఎ కోర్టు మరణ శిక్షను విధించింది. దీనిపై దోషులు అసుదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, జియావుర్ రెహ్మాన్ ఆలియాస్ వకాస్, మహ్మద్ తహసీన్ అక్తర్, మహమ్మద్ అహ్మద్ సిదిబాపా ఆలియాస్ యాసిన్ భత్కల్ , ఎజాజ్లు షేక్ అలియాస్ సమర్ అర్మాన్ లు  తమకు పడ్డ ఉరిశిక్షను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనితో పాటుగా  ఎన్ఐఎ కోర్టు తాను విధించిన ఉరిశిక్షను ధృవీకరించడానికి తీర్పును హైకోర్టుకు నివేదించింది. తీర్పు కాపీతో పాటుగా  ఇతర రికార్డులను మొత్తం ఎన్ఐఎ కోర్టు హైకోర్టుకు పంపింది. కింది కోర్టు పంపిన తీర్పుకాపీలతో పాటుగా దోషులు చేసుకున్న అపీళ్లను కలిపి హైకోర్టు విచారించ నుంది. కింది కోర్టు పంపిన శిక్ష నిర్థారణకు సంబంధించి హైకోర్టు ముడు నెలల్లో తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విచారణను సత్వరం చేపట్టాలని ఎన్ఐఎ తరపు న్యాయవాది కోర్టును కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *