నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం ఆడియో విడుదల తిరుపతిలో వైభవంగా జరిగింది. అభిమానుల కేరింతల మధ్య సందడిగా జరిగిన కార్యక్రమంలో గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో విడుదల కార్యక్రమం అట్టాహాసంగా జరిగింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల సమక్షంలో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి తొలిసీడిని ఆవిష్కరించి వెంకయ్యనాయుడికి అందచేశారు. బాలకృష్ణ నటించిన వందవ చిత్రం కావడంతో దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బాలకృష్ణ సరసన శ్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ మేటి నటి హేమామాలిని ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చిరంతన్ భట్ సంగితం సమకూర్చిన ఈ సినిమా ఆడియో కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు.