తొమ్మిది రూపాయలకే ఒక చీర అంటూ హన్మకొండ లోని దుకాణుదారుడు ఒకరు చేసిన ప్రకటన పలువురు మహిళల ప్రాణాల మీదకు తెచ్చింది. దుకాణం ప్రచారం కోసం తొమ్మిది రూపాయలకే ఒక చీర అంటూ విస్తృుతంగా ప్రచారం చేశారు. దీనితో చీరల కోసం ఉదయం ఆరు గంటలకే దుకాణం ముందు దాదాపుగా ఆరకిలోమీటరు వరకు క్యూలైను ఏర్పడింది. పెద్ద సంఖ్యలో మహిళలు దూకాణం వద్దకు చేరుకున్నారు.
దుకాణం తెరుచుకునేంతవరకు క్యూలైన్లో ఒపిగ్గా నిల్చున్న జనం దుకాణం తెరిచిన వెంటనే ఒక్కసారిగా దుకాణంలోకి చొచ్చుకునిపోయేందుకు ప్రయత్నంచడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. తోపులాటల వల్ల ఒకరిపై ఒకరు పడిపోయారు. తొక్కిసలాటలో కొంతమంది సృహతప్పిపడిపోయారు. పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో దుకాణుదారుడు చేతులెత్తేశాడు. జనాన్ని అదుపుచేయడంలో పూర్తిగా విఫలం అయ్యారు. దీనితో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. మహిళలు అస్వస్థతకు గురికావడంతో వారికి ప్రథమ చికిత్స అందించారు.