నగ్నంగా డ్యాన్స్ చేయండి-మీడియా పై మంత్రి ఆగ్రహం

సౌమ్యుడిగా పేరుపొందిన కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పరికర్ మీడియా మీద తీవ్రస్థాయిలో విరుచుకుని పడ్డారు. ఒక స్థానిక పత్రిక పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మనోహర్ పరికర్ విమర్శలు శ్రుతిమించాయి. పబ్లిసిటీ కోసం నానా యాగీ చేస్తున్న మీడియా బట్టలు విప్పి నగ్నంగా డ్యాన్స్ చేస్తే మరింత పబ్లిసిటీ వస్తుందని తీవ్రంగా వ్యాఖ్యానించారు. గోవాలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పారికర్ మీడియా పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియా తన పరిమితులను గుర్తించడం లేదంటూ మండిపడ్డారు.

వెయ్యికాపీలు కూడా అమ్ముడుపోని సదరు దినపత్రిక అంతర్జాతీయ స్థాయిలో సంపాదకీయాలు రాసి పబ్లిసిటీ పొందాలని తాపత్రయపడుతున్నదని ఎద్దేవా చేశారు. రక్షణ మంత్రి వ్యాఖ్యాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.