వేడెక్కిన కర్ణాటక రాజకీయం

0
54

కర్ణాటకలో ఎన్నికల వేడి రోజురోజుకీ ఊపందుకుంటోంది. అధికార కాంగ్రెస్ పార్టీతో బీజేపీ అమితుమీ సిద్ధమవుతుండగా మూడో ఫ్రంట్ అంటూ దేవగౌడ తన అదృష్టాన్ని పరిక్షించుకోవాలని చూస్తున్నారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటలో ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో తిరిగి అధికారం దక్కించుకోవాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను ఒడిసి పట్టుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. కర్ణాటక జనాభాలో 17శాతంగా ఉన్న వీరశైవలింగాయతుల ప్రాబల్యం అధికం. అనేక గ్రామసీమల్లో వారిపట్టు అధికం. లింగాయవతులను ఆకట్టుకోవడానికి బీజేపీ అధిష్టానం యడ్యూరప్పను రాష్ట్రపార్టీ అధ్యక్షునిగా నియమించి బీజేపీ గెలిస్తే సీఎం ఆయనేనని ప్రకటించారు. యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ బృందం గత 3 నెలలుగా ‘పరివర్తన’ యాత్ర పేరిట కర్ణాటక అంతటా కలియదిరిగి సిద్ధ రామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ అవినీతి అక్రమాలను ఎండగట్టింది. అంతేగాక బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ఇతర కేంద్ర మంత్రులు కర్ణాటకపై కేంద్రీకరించి కమల శ్రేణులను బూత్‌స్థాయిలో ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు.బీసీలు, దళితులను మచ్చిక చేసుకోవడానికి తాజాగా యడ్యూరప్ప తదితర నేతలు మురికివాడలు, దళితపేటల్లో నిద్రచేసి అక్కడే సహపంక్తి భోజనం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని బీజేపీ అశలు పెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్ ను తక్కువ అంచానా వేయకూడదని ఆ పార్టీ భావిస్తోంది. ఇటీవల పరిణామాలు ఆ పార్టీని కలవర పెడుతున్నప్పటికీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ గట్టిగా నమ్ముతోంది.
గత ఎన్నికల్లో బీజేపీలోని కుమ్ముమాటలు కాంగ్రెస్ కు వరంగా మారాయి. తిరిగి అధికారాన్ని నిలుపుకునేందుకు ఆ పార్టీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. సంప్రదాయ ఓటర్లనే నమ్ముకున్న కాంగ్రెస్ గత ఐదు సంవత్సరాల్లో తాము చేసిన అభివృద్ది కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ధీమా చెప్తున్నా క్షీణించిన శాంతిభద్రతలు, అవినీతి ఆరోపణలు ఆ పార్టీకి తలనొప్పులుగా మారాయి. దక్షిణాది రాష్ట్రాల్లో రాహుల్ ప్రతిష్ట పెరుగుతోందంటూ వస్తున్న వార్తలు కాంగ్రెస్ కు ఊరట నిస్తున్నాయి. మరో వైపు కావేరి జల వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు కర్ణాటకు అనుకూలంగా రావడం కూడా ఆ పార్టీకి కలిసివచ్చే అవకాశం ఉంది.
మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్‌(ఎస్‌) ఇటీవల మాయావతి నేతృత్వంలోని హుజన సమాజ్‌ పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. బీఎస్‌పీ కర్ణాటకలో దళ్‌-మిత్ర పక్షాల మద్దతుతో 20 శాసనసభా స్థానాలకు పోటీ చేయనుంది. సీపీఐ, సీపీఐ(ఎం), ఇతర అభ్యుదయ శక్తులతో కర్ణాటకలో 3వ ప్రత్యామ్నాయ నిర్మాణానికి దేవెగౌడ ఆయన కుమారుడు సీఎం అభ్యర్థి హెచ్‌డి కుమారస్వామి ప్రయత్నాలు సాగిస్తున్నారు.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here