తెలంగాణలో పవన్ కళ్యాణ్ యాత్ర

0
70

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “ఛలోరే ఛలో” పేరుతో యాత్రను మొదలు పెట్టారు. హైదరాబాద్ నుండి భారీ కాన్వాయ్ తో బయలుదేరిన పవన్ కళ్యాణ్ నేరుగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్,ఆదిలాబాద్ జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునే కార్యక్రమంలో భాగంగానే ఈ రాజకీయ యాత్రను చెపట్టినట్టు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు.
తెలంగాణ యాత్రకు బయలుదేరిన పవన్ కు ఆయన భార్య అన్నా లెజినోవా హరతిని ఇచ్చి ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ యాత్ర సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు పవన్ ను అనుసరిస్తున్నారు. సుమారు 50 వాహనాలతో పవన్ కొండగట్టుకు బయలుదేరారు. పవన్ ను చూసిన కొంత మంది అభిమానులు సీఎం పవన్ అంటు నినాదాలు చేశారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన రాజకీయ ప్రధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పవన్ తెలంగాణలో ఎట్లా పర్యటిస్తారంటూ పలువురు అభ్యతరం వ్యక్తం చేస్తుండగా మరో వైపు పవన్ అభిమానులు మాత్రం ఆయన వేంటే ఉంటూ సందడి చేస్తున్నారు. కొండగట్టుకు బయలుదేరిన పవన్ కు ఆయన అభిమానులు స్వాగతం పలికారు. తెలంగాణ ప్రాంతంలో జనవరి 26వ తేదీవరకు పవన్ పర్యటన సాగనుంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here