మధ్యంతరం దిశగా తమిళ రాజకీయాలు?

0
68

తమిళనాడు అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు తప్పవా..? ఇప్పుడు తమిళనాట ఇదే హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ రంగ ప్రవేశం గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేయడంతో పాటుగా తమిళనాట నెలకొన్న రాజకీయ అనిశ్చిత వల్ల రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే ఉహాగానాలు ఎక్కువగా విపిస్తున్నాయి. జయలలిత మరణం దగ్గరి నుండి తమిళనాడు రాజకీయాల్లో శూన్యత ఏర్పడింది. అమ్మ మరణంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. జయలలితకు ఎవరు వారసులు అనే విషయంపై తమిళనాడులో దాదాపుగా యుద్ధమే నడుస్తోంది. పార్టీని ప్రభుత్వన్ని తన చేతుల్లోకి తీసుకుని చక్రం తిప్పాలని చూసిన శశికళకు జైలు శిక్ష పడడంతో ఆమె ఆశలు నీరుగారిపోయాయి. గతంలో జయలలిత మాదిరిగానే జైలు నుండే చక్రం తిప్పలని చూసి శశికళకు ఆ అవకాశం లేకుండా పోయింది.
జయలలిత మరణంతో ఆమె స్థానంలో పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అమ్మకు నమ్మిన బంటుగా ఉన్న సెల్వం చిన్నమ్మకు ఎదురుతిరగడంతో ఆయనకు పదవీగండం ఏర్పడింది. సెల్వంను ఏకంగా పార్టీ నుండే బహిష్కరించిన చిన్నమ్మ పళనిస్వామిని ఆ పీఠంపై కూర్చోబెట్టింది. ఆ తరువాత కొద్దిరోజులకే పరిస్థితులు తారుమారు అయ్యాయి. అప్పటివరకు ఉప్పు నిప్పుగా ఉన్న పన్నీరు సెల్వం, పళని స్వామి వర్గాలు ఒక్కటయి జయలలిత నేస్తం శశికళను పార్టీనుండి బయటకి నెట్టాయి. పన్నీరు సెల్వం తిరిగి క్యాబినెట్ లో చేరారు. మేజార్టీ ఎమ్మెలు పన్నీరుకు, పళని స్వామికే ఓటు వేయడంతో జైల్లో ఉన్న శశికళ ఏమీచేయలేకపోయారు.
తమిళనాడులో రాజకీయంగా పరిస్థితులు కాస్త చక్కబడుతున్నాయి అనుకుంటున్న సమయంలో ఆర్కె నగర్ ఉప ఎన్నిక ఫలితం తమిళనాట పెను సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది. జయలలిత మరణంతో ఏర్పడిని ఖాళీకి జరిగిన ఎన్నికలపైనే రాష్ట్రంతో పాటుగా దేశం మొత్తం ఆశక్తిని రేపింది. జయలలిత నిజమైన వారసులు ఎవరు అనేది అర్కేనగర్ ఉప ఎన్నికలో తేలిపోతుందని ప్రచారం జరగడంతో అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఉపఎన్నికలు తీసుకున్నాయి. నాటకీయ పరిణామాల మధ్య ఒకసారి వాయిదా పడ్డ ఎన్నికలు తిరిగి జరిగాయి. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా విశ్లేషకులు చెప్పుకున్న ఇక్కడి ఎన్నికల ఫలితాలతో అన్నాడీఎంకే,డీఎంకే పార్టీలు ఖంగుతిన్నాయి. శశికళకు దగ్గరి బంధువు దినకరన్ ఇక్కడ భారీ మెజార్టీతో గెలుపొందడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో పడేశాయి. అమ్మ మరణంలో రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రయత్నాలు సాగించిన డీఎంకే అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. దీనితో అమ్మకు నిజమైన వారుసులం తామేనని శశికళ వర్గం ప్రచారం మొదలు పెట్టింది. అన్నాడీఎంకే పార్టీతో పాటుగా ఎమ్మెల్యేలు త్వరలో తిరుగుబాటు చేస్తారని చెప్తున్న దినకరన్ తిరిగి ప్రభుత్వ పగ్గాలు తమకే దక్కుతాయని అంటున్నారు.
తమిళనాడులో గట్టిపట్టున్న కమలాసన్ పార్టీ ప్రకటించడం తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పార్టీని ప్రకటించడంతో తమిళనాట రాజకీయ సమీకరణాలు భారీ మారవచ్చని భావిస్తున్నారు. అధికార అన్నాడీఎంకే , విపక్ష డీఎంకే ఇప్పుడు నాకకత్వ సమస్యను ఎదుర్కొంటున్న అమ్మ మరణం తరువాత అన్నాడీఎంకేను నడిపించే సమర్థ నాయకులు లేకుండా పోయారు. ఇటు డీఎంకే లో నాయకత్వ సమస్య స్పష్టంగా కనిపిస్తోంది. కరుణానిధి స్థాయిలో స్టాలిన్ పనిచేయడంలేదని విమర్శలు ఉన్నాయి. కరుణానిధి వృద్దాప్యం కారణంగా ఏమాత్రం చురుగ్గా వ్యవహరించడం లేదు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తమిళనాడులోని పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది ఏ మాత్రం విజయవంతం అవుతుందో చూడాలి.
(బీ.వీ.ఎల్.కే.మనోహర్)

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here