ఓయులో ఉధ్రిక్తత

0
46

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆదివారం ఆత్మహత్య చేసుకున్న మురళి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించే క్రమంలో తీవ్ర ఉధ్రిక్తత నెలకొంది. మురళి మృతదేహాన్ని పోస్టు్ మార్టంకు తరలించేందుకు విద్యార్థులు అంగీకరించలేదు. ఆయన ఆత్మహత్య లేఖపై అనుమానాలు ఉన్నట్టు చెప్పిన విద్యార్థులు మురళి మృతికి ప్రభుత్వానిదే భాద్యత అంటు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయకపోవడం వల్లే మురళి చనిపోయాడంటూ ఆందోళనకు దిగారు. ఆయన మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించకుండా అడ్డుకున్నారు.
పరిస్థితి మరింత విషమించకుండా పోలీసులు భారీఎత్తున మోహరించారు. మురళీ ఆత్మహత్యకు పాల్పడిన రూం నుండి ఆయన మృతదేహాన్ని బలవంతంగా గాంధీ ఆస్పత్రికి తరలించారు. తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు అడ్డుకున్న వారిపై లాఠీలు ఝళిపించారు. ఈ క్రమంలో పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారినిపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. అడ్డువచ్చిన వారిని బలవంతంగా పక్కకు నెట్టి మరీ మురళి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
పోలీసుల లాఠీఛార్జీలో విద్యార్థులతో పాటుగా కొంత మంది మీడియా ప్రతినిధులకు కూడా గాయాలయ్యాయి. పోలీసులు హాస్టళ్లలోకి దూరిమరి విచక్షణా రహితంగా లాఠీఛార్జీ చేశారని దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారని విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసుల లాఠీఛార్జీ కి సంబంధించిన దృశ్యాలు చూడండి…
Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here