ఇవాంకని వెన్నంటి ఉండే ఆ 8 మంది ఎవరు…?

హైదరాబాద్ లో పర్యటిస్తున్న ఇవాంక ట్రంప్ భద్రత కోసం అడుగడునా పోలీసులు మోహరించారు. ప్రపంచంలోని దాదాపు అన్ని ఉగ్రవాద సంస్థలకు టార్గెట్ గా ఉన్న అమెరికా అధ్యక్షుడి కుటుంబ సభ్యురాలిగా అమెకు కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు యంత్రాంగం యావత్తు ఇవాంక రక్షణ బాధ్యతల్లో నిమగ్నమై ఉంది. వీరితో పాటుగా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు, అమెరికా సీక్రెట్ సర్వీస్ పోలీసులు ప్రజల్లో కలిసిపోయి డేగకళ్లతో కాపలాకాస్తున్నారు. అత్యాధునికి ఆయుధాలు, పరికరాలతో చిమ చిటుక్కుమన్నా తెలుసుకునేలా నా అడుగడునా నిఘా పెట్టారు.
ఇవాంక రక్షణ ఏర్పాట్లన్నీ అమెరికాకు చెందిన అధికారులే చూస్తున్నారు. ఆమె ప్రయాణించే కారును కూడా అమెరికా నుండే తెప్పించుకున్నారు. వంటవాళ్లు కూడా అమెరికా నుండే వచ్చారు. ఇవాంక రక్షణ కోసం అమెరికా యంత్రంగం భారీ ఏర్పాట్లే చేసింది. ఇవాంక రక్షణను దృష్టిలో పెట్టుకుని వారు చేసిన ఏర్పట్లు కూడా బయట ప్రపంచానికి తెలీనీయడం లేదు.
మంగళవారం ఉదయం హైదరాబాద్ లో కాలు మోసిన ఇవాంకకు ఇక్కడ ఘన స్వాగతమే లభించింది. ముందుగా నిర్ణయించిన వ్యక్తులు మినహా మరెవరికీ అనుమతి లభించలేదు. అంతా పక్కా ప్రణాళిక ప్రకారం అమెరిక రక్షణ వర్గాలు ఆమెను అనుక్షణం వెన్నంటే ఉంటున్నాయి.
వేల సంఖ్యలో రాష్ట్ర పోలీసులు, వందల సంఖ్యలో అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు ఇవాంక రక్షణకు సంబంధించిన బాధ్యతలను నిర్వహిస్తున్నప్పటికీ ఇవాంకాను కంటికి రెప్పలా కాపాడేదీ మాత్రం కేవలం 8 మందితో కూడిన ప్రత్యేక బృందం మాత్రమే.
ఈ ఎనిమిది మంది నిత్యం ఆమె వెంటే ఉంటారు. ముందుగా అనుమతి ఉన్న వారు తప్ప ఇతరులు ఎవరూ ఇవాంక దరిదాపులకు రాకుండా వీరు జాగ్రత్తలు తీసుకుంటారు. అమెరికాకు చెందిన ఇతర రక్షణ సిబ్బంది కూడా వీరిని దాడుకుని పోయేందుకు అనుమతి ఉండదు. అత్యంత సుశిక్షుతులైన వీరు అన్నిరకాల ఆయుధాలను ప్రయోగించగలరు. వీరి వద్ద కంటికి కనిపించని ఆయుధాలు ఉంటాయి. అత్యవసర సమయాల్లో రెప్పపాటులో స్పందించడం, ఒంటి చేత్తోనే ప్రత్యర్థిని మట్టుపెట్టగల సామర్థ్యం వీరి సొంతం.
ప్రపంచంలోనే అత్యంత కఠిన పరీక్షలు నిర్వహించి వీరిని ఎంపిక చేస్తారు. మెరికల్లాంటి ఈ రక్షణ సిబ్బంది అమెరికా అధ్యక్షుడితో పాటుగా వారి కుటుంబ సభ్యుల వెన్నంటే ఉంటారు. వందల రౌండ్ల బెలెట్లను పేల్చగలిగే ఆటోమేటిక్ తుపాకులతో పాటుగా ఇతర ఆయుధాలు కూడా సిద్ధంగా ఉంటాయి. అయితే వీరి అయుధాలు బయటకు కనిపింనీయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *