విషంగా మారుతున్న ఆహారం

0
62

దేశవ్యాప్తంగా ఒక పక్క ఎరువులు, పురుగు మందుల వాడకం పై ఆందోళన వ్యక్తం అవుతుండగా మరో వైపు ప్రమాదకర రసాయన మందులను పొలాల్లోకి చేరుతున్నాయి. రైతుల అవగాహానా రాహిత్యం ఒక వైపు, దుకాణు దారుల లాభాలు మరో వైపు వెరసి అత్యంత విషపూరిత రసాయనాలు పండ్లు, కూరగాయాలతో పాటుగా ఇతర ఆహార పదార్ధాల్లో కలిసి పోతున్నాయి. వీటిని నివారించాల్సిన అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆహరం విషతుల్యంగా మారుతోంది. రసాయనాలు చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి వీటిని కాయలను అతి త్వరగా పండ్లుగా మార్చడానికి, బంగారు రంగులతో పసుపుపచ్చని వనె్నలతో ఈ పండ్లు జనాన్ని ఆకర్షించడానికి వాడుతున్నారు. ‘‘చైనా పౌడర్ల’’ను కూరగాయలను పండ్లను నిలువ చేయడానికి వాడుతున్నారు. ఆహారశుద్ధి ప్రక్రియలో జరుగుతున్న ‘కల్తీ’ ప్రమాద స్థాయికి చేరుకుంటోంది.విషమెక్కిన కూరగాయలు, పండ్లు, బియ్యం, గోధుమలు, పప్పులు, నూనెలతో ప్రజలు ఆరోగ్యం కుదేలవుతోంది.
ఈ ప్రమాదకర రసాయనాల వల్ల పోలాల్లో సారం కూడా తగ్గిపోతున్నట్టు పరిశోధనల్లో తేలింది. తాత్కాలిక ప్రయోజనాల కోసం చేస్తున్న పనుల వల్ల దీర్ఘకాలికంగా అనేక సమస్యలు వస్తున్నాయి. ఈ విషం నుండి బయటపడాలంటే సేంద్రీయ పద్దతుల్లో సేధ్యం చేయడం ఒక్కటే పరిష్కారం ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here