తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం

0
54
Munneru over flowing on Chillakallu - Wyra highway at Lingala causeway in Vatsavai mandal in Krishna district on Sunday. Express Photo.

తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల చిరు జల్లులు పడగా మరికొన్ని చోట్ల బారీ వర్షం పడింది. వానలు లేక అల్లాడుతున్న రైతన్నలకు ఈ వర్షలు కొత్త ఊపిరి పోసినట్టుగానే కనిపిస్తోంది. వర్షాలకు కొన్ని చోట్ల వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలకు అనేక చోట్ల వాగులు పొంగాయి. పలు చోట్ల గ్రామాలకు రాకపోకలు నిల్చిపోయాయి. తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీనితో 11 గేట్లను ఎత్తివేశారు. చ‌ర్ల మండ‌లంలోని చింత‌వాగు, రోటెంత‌వాగులు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. ప‌గిడివాగు, ఈత‌వాగు వంతెన‌లు నీట మునిగిపోయాయి. భారీ వర్షాలకు సింగరేణి గనుల్లో ఉత్పత్తి నిల్చిపోయింది.
జయశంకర భూపాల పల్లి జిల్లాలోనూ పలు చోట్ల భారీగా వర్షాలు పడ్డాయి. దీనితో ములుగు మండలంలోని పలువాగులు పొంగి ప్రవహస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిల్చిపోయాయి. వరంగల్ రూరల్ జిల్లాలోనూ భారీగా వర్షాలు కురిశాయి.
ఇటు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ గా వర్షం పడింది. నగరం మొత్తం ఉదయం నుండే మబ్బు పట్టి ఉండగా పలు చోట్ల భారీ వర్షం పడింది. మరో రెండు రోజులు వానలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here