50,100 నోట్లు చెల్లుతాయి-అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు

0
54

దేశవ్యాప్తంగా 50,100 రూపాయల నోట్లను రద్దు చేసినట్టు సామాజిక మాధ్యామాల్లో జరుగుతున్న ప్రచారంతో ప్రజలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 50,100 రూపాయల నోట్లను రద్దు చేసిందని అవి చెల్లుబాటు కావని అయితే అక్టోబర్ 21వ తేదీ వరకు బ్యాంకుల్లో జమ చేసుకోవచ్చంటూ జరుగుతున్న ప్రచారంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. గతంలో పెద్ద నోట్ల రద్దయిన సందర్భంగా టీవీల్లో వచ్చిన వార్తలకు సంబంధించిన చిత్రాలను మార్ఫ్ చేసి ఫలానా న్యూస్ ఛానల్ లో ఈ వార్త వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారం ప్రజలను తికమక పెడుతోంది. ఆర్బీఐ కొత్త 50 రూపాయల నోట్లను చలామణిలోకి తీసుకుని వచ్చినా పాత నోట్లు యధావిధిగా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. 50 రూపాయలు, 100 రూపాయల నోట్ల విషయంలో ఎటువంటి అనుమాలు అక్కరలేదని అవి మాములుగానే చెల్లుతాయని ఆర్బీఐ ఇప్పటికే పలు సార్లు స్పష్టం చేసినప్పటికీ ఈ ప్రచారాలు మాత్రం ఆగడం లేదు. నోట్లు రద్దయ్యాయని ప్రచారంతో కొందరు దుకాణుదారులు 50,100 రూపాయల నోట్లను తీసుకునేందుకు నిరాకరిస్తున్నట్టు సమాచారం. మరో వైపు వినియోగ దారులు కొందరు 50,100 రూపాయల నోట్లను తీసుకోకపోవడంతో తీవ్ర చిల్లర సమస్య తలెత్తుతోంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here