5న పోలింగ్‌.. 9న ఫలితాలు

బెంగళూరు: కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 5న పోలింగ్‌ జరగనుంది. వీటి ఫలితాలు డిసెంబర్‌ 9న విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో రేపటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది.
అయితే అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు అసెంబ్లీ గడువు ముగిసే వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా స్పీకర్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో 15 ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. అయితే వీరి కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.మరో రెండు రోజుల్లోనే దీనిపై న్యాయస్థానం తీర్పును వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలని యడియూరప్ప సర్కార్‌ భావిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌, జేడీఎస్‌ కూడా ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.