మహిళల జుట్టు కత్తిరిస్తున్నది ఎవరు…?

0
57

వరుసగా మహిళల జుట్టును గుర్తుతెలియని వ్యక్తులు కత్తిరిస్తున్న ఘటనలు ఉత్తర భారత దేశాన్ని వణికిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో మొదలైన ఈ వ్యవహారం క్రమంగా ఇతర రాష్ట్రాలకూ పాకింది. మహిళలు నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వారి జుట్టును కత్తిరిస్తున్నారు. తమను సృహ కోల్పోయేట్లు చేసి జుట్టును కత్తిరిస్తున్నారంటూ పలు చోట్ల మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు. యూపీ నుండి మొదలైన ఈ తరహా ఘటనలు వరసుగా జరుగుతుండడంతో మహిళలు బెంబేలెత్తుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ తో పాటుగా రాజస్థాన్, హర్యానాల్లోనూ ఈ తరహా ఘటనలు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు తమ జుట్టును కత్తిరించారంటూ పలువురు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ తరహా ఘటనలను తొలుత తేలిగ్గా తీసుకున్న పోలీసులు వరుస ఘటనలు జరుగుతున్న నేపధ్యంలో అప్రమత్తం అయ్యారు. మహిళల జుట్టును ఎవరు కత్తిరిస్తున్నది ఎవరు? ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు మహిళల జుట్టును కత్తిరిస్తున్న ఘటనలపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనితో మహిళలు మరింత బెంబేలెత్తిపోతున్నారు. ఒక దెయ్యం మహిళల జుట్టును కత్తిరిస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనితో పెద్ద సంఖ్యలో మహిళలు మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు మాత్రం ఇటువంటి వాటిని నమ్మవద్దని ఇది ఖచ్చితంగా ఆకతాయిల పనేనని చెప్తున్నారు. త్వరలోనే ఈ చర్యలకు పాల్పడుతున్నవారిని పట్టుకుంటామని మహిళలు భయపడాల్సింది లేదని పోలీసులు భరోసా ఇస్తున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here