ప్రముఖ హీరో రవితేజ డ్రగ్స్ వాడుతున్నట్టుగా వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమైనవని ఆయన తల్లి రాజ్యలక్ష్మి స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పలువురికి నోటీసులు జారీ చేసింది. ఇందులో రవితేజా కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. వీటిని రవితేజ తల్లి రాజ్యలక్ష్మి ఖండించారు. తన కుమారుడికి డ్రగ్స్ అలవాటు లేదని అతను సిగరెట్ కూడా తాగడని స్పష్టం చేశాడు. తాను ఇట్లాంటి అలవాట్లకు దూరంగా ఉండడంతో పాటుగా అటువంటి అలవాట్లు ఉన్న వారికి కూడూ రవితేజ దూరంగా ఉంటాడని ఆమె చెప్పుకొచ్చారు. డ్రగ్స్ కేసులో రవితేజను ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని రవితేజ తల్లి రాజ్యలక్ష్మి ఆరోపించారు. రవితేజకు పనే ప్రాణమని అన్నారు. ఎప్పుడూ తన పనిలో తాను బిజీ ఉంటాడని ఆమె చెప్పారు. ఇతరులను ఇబ్బందులు పెట్టడం తన కుమారుడికి అసలు ఇష్టం ఉండదని అన్నారు. ఈ కారణం వల్లే తమ్ముడు చనిపోయిన బాధలో ఉండికూడా తన వల్ల ఇతరులకు నష్టం కలగకూడదన్న ఉద్దేశంతోనే బాధను దిగమింగుకుని షూటింగ్ కు వెల్లాడని ఆమె అన్నారు. ఎటువంటి దురలవాట్లు లేని రవితేజ పేరు డ్రగ్స్ కేసులో రావడం బాధాకరమన్నారు.
చనిపోయిన కుమారుడు భరత్ కూడా మధ్యం సేవించి వాహనం నడుపుతూ ప్రమాదంలో చనిపోయాడనడం వాస్తవం కాదన్నారు. గతంలో అతనికి కొన్ని దురలవాట్లు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో వాటికి దూరంగా ఉంటూ వచ్చాడని చెప్పారు. భరత్ అంత్యక్రియలకు తాను హాజరు కాకపోవడంపై మాట్లాడుతూ తమ కుటుంబ ఆచారం ప్రకారమే తాను అంత్యక్రియలకు దూరంగా ఉన్నట్టు చెప్పారు. ఇప్పటికే తమ కుటుంబం బాధతో ఉందని ఈ సమయంలో రవితేజ పేరును డ్రగ్స్ కేసులో ప్రచారం చేయడం దారుణమన్నారు.