సరిహద్దుల్లో చైనా సైనిక విన్యాసాలు

టిబెట్ సరిహద్దుల్లో చైనా భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. సిక్కింలో భారత్-చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉధ్రిక్తత పరిస్థితులు నెలకొన్న సమయంలో చైనా ఈ సైనిక విన్యాసాలు నిర్వహించడం విశేషం. సాధారణానికి భిన్నంగా లైవ్ ఫైర్ ఎక్సర్సైజ్ ను నిర్వహించింది. ప్రత్యర్థికి చెందిన బంకర్లను ధ్వసం చేయడం , క్షిపణులను ప్రయోగించడం, విమానాలను ధ్వంసం చేయడం లాంటి విన్యాసాలను చైనా నిర్వహించడంతో పాటుగా వీటికి సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేయడాన్ని బట్టి చూస్తుంటే చైనా పనిగట్టుకుని ఈ చర్యకు పాల్పడి ఉంటుందని నిపుణులు అనుమానిస్తున్నారు. తమ సైనిక సామర్థ్యాన్ని చాటడం కోసమే చైనా ఈ తరహా విన్యాసాలు నిర్వహించి ఉంటుందని అంటున్నారు. భారత్-చైనా సరిహద్దులకు అత్యంత సమీపంలో ఈ మాక్ డ్రిల్ జరిగినట్టు తెలుస్తోంది. సుమారు 11 గంటల పాటు చైనా ఈ సైనిక విన్యాసాలు నిర్వహించినట్టు సామాచారం.
భారత్-చైనా సరిహద్దుల్లోని డోక్లామ్ వద్ద ఉధ్రిక్త పరిస్థితులు ఇంకా సద్దు మణగలేదు. ఇరు దేశాలకు చెందిన సైనికులు సరిహద్దుల్లో మోహరించి ఉన్నాయి. పరిస్థితి ఇప్పటికీ ఉధ్రిక్తంగానే ఉంది. భారత్ పెద్ద సంఖ్యలో తన సైనిక బలగాలను మోహరించడం చైనాకు మింగుడుపడడం లేదు. ఛైనా హెచ్చరికలను పట్టించుకునేది లేదని చెప్పిన భారత్ ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారత్ బలగాలు సిద్ధంగా ఉండడంతో చైనా మాక్ డ్రిల్ ను నిర్వహించడం లాంటి చర్యలకు పూనుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *