అక్బరుద్దీన్ నోటికి తాళం పడదా…?

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఎం.ఐ.ఎం శాశనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కి అలవాటు గా మారింది. పోలీసుల హెచ్చరికలను, కోర్టు కేసులను బేఖాతరు చేస్తూ అక్బరుద్దీన్ ఓవైసీ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలో ఉంటునే ఉన్నారు. ఒక వర్గం ప్రజలను ఆకట్టుకునే క్రమంలో మరో వర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పాటుగా వారిని కించపర్చే విధంగా మాట్లాడడంతో అతని అలవాటయిపోయింది. ముస్లీం ప్రాబల్య ప్రాంతాల్లో బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న ఎం.ఐ.ఎం పార్టీ ఈ క్రమంలో ఆ వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు మరో వర్గంపై అనుచిత వ్యాఖ్యలకు దిగుతోంది. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండడంతో ఓవైసీ సోదరులకు అలవాటుగా మారిపోయింది. బీజేపీ నేతలను టార్గెట్ గా చేసుకుని అన్న అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటే ఆయన తప్పుడు అతని కన్నా రెండాకులు ఎక్కువ చదివినట్టు కనిపిస్తోంది. ఓక వర్గం నేతలపై కాకుండా ఆ వర్గానికి చెందిన వారందరినీ, వారి దేవతలను విమర్శించడం అలవాటుగా మారింది.
గతంలో నిర్మల్ లో జరిగిన ఎం.ఐ.ఎం సభలో నోటికి వచ్చినట్టు మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసీ అప్పట్లో ఈ కేసులో జైలుకు సైతం వెళ్లి వచ్చాడు. అయినా అతని ప్రవర్తలో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. నోటిని అదుపులో పెట్టుకోకుండా ఒక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మామూలే. తాజాగా అక్బరుద్దీన్ ఓవైసీ చంద్రాయణ గుట్టలో జరిగిన పార్టీ సమావేశంలో చేసి ప్రసంగంపై సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక న్యాయవాది కేసును నమోదు చేశారు. భారత మాతపై చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో న్యాయవాది కేసు పెట్టారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసును నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *