చైనా పై మోడీ మౌనం దేనికి సంకేతం..? :రాహుల్

చైనా కయ్యానికి కాలు దువ్వుతున్నా ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఎందుకు నోరు మెదపడం లేదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సిక్కింలోని భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు తీవ్ర రూపం దాలుస్తున్నా కేంద్రం దీనిపై స్పష్టంగా ఒక ప్రకటన చేయడం లేదని అన్న రాహుల్ గాంధీ ప్రధాని ఈ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు. ఇటీవలే విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన రాహుల్ గాంధీ వరుసగా ప్రధాని మోడీపై విమర్శల వర్షం కురిస్తున్నారు. ప్రధాని విదేశీ విధానాన్ని లక్ష్యంగా చేసుకుని రాహుల్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రధాని మోడీ అమెరికా ముందు సాగిలపడ్డారని రాహుల్ ధ్వజమెత్తారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ల భేటీ కేవలం ఫొటోలకు పోజులివ్వడంతోనే సరిపోయిందని రాహుల్ ఎద్దేవా చేశారు. భారత్ పాలిన కాశ్మీర్ అంటూ అమెరికా తన అధికారిక ప్రకటనలో పేర్కొన్నా మోడీ మౌనంగా ఉండిపోయారని అన్నారు. భారత్ పాలిత కాశ్మీర్ అంటూ అమెరికా ప్రస్తావిస్తుంటే మోడీ మౌనం భారత విధానికి, మన వాదనకు విరుద్దమని అన్నారు. ట్రంప్ తో భేటి సందర్భంగా అమెరికా లో భారతీయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. హెచ్1బి వీసాలపై మోడీ ఎందుకు ప్రస్తావించలేదని మోడీ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *