సరిహద్దుల్లో కత్తులు-విదేశాల్లో కౌలిగింతలు

భారత్-చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉధ్రిక్తత నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారత్-చైనా అగ్రనేతలు జర్మనీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక అంశాలపై ఎటువంటి చర్చ జరగక్కున్నా ఇరు దేశాధీనేతలు పరస్పరం కలుసుకుని కాసేపు ముచ్చటించారు. జర్మనీలో జరుగుతున్న జీ-20 సమావేశం భారత్-చైనా దేశాధినేతల కలయికకు వేదికయింది. జర్మనీలో ప్రారంభమైన జి-20 సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కూడా హాజరయ్యారు. ఇరుదేశాల సరిహద్దుల్లో ఉధ్రిక్తలు తీవ్ర రూపం దాల్చిన నేపధ్యంలో వీరిద్దరి భేటీకి విశేష ప్రదాన్యం ఏర్పడింది. జి-20 సదస్సతో పాటుగా బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. భారత్, చైనా లతో పాటుగా రష్యా, బ్రెజిల్, దక్షిణ ఆఫిక్రాలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. ఈ సమావేశంలో భారత్, చైనాలు పరస్పరం ఒకరిపై ఒకరు ప్రశంశలు కురిపించుకోవడం గమనార్హం.
బ్రిక్స్ సమావేశంలో ముందుగా మాట్లాడిన ప్రధాని మోడీ ఈ సంవత్సరం ఆఖర్లో చైనాలోని జియామెన్‌లో నిర్వహించే బ్రిక్స్‌ సదస్సుకు భారత్‌ పూర్తి మద్దతిస్తుందని తెలిపారు.బ్రిక్స్ కు ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న చైనాపై ప్రశంశల జల్లు కురిపించారు. ఆ తరువాత మాట్లాడిన చైనా అధ్యక్షుడు భారత్ రానున్న రోజుల్లో మరింత అభివృద్ది చెందాలని ఆకాక్షింస్తున్నట్టు చెప్పారు. ఆర్థిక రంగంలో భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును ప్రశంసించారు. ఉగ్రవాదం పై పోరులో భారత్ చురుకైన పాత్రను పోషిస్తోందని చైనా అధ్యక్షుడు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *