మజ్లీస్ ఎమ్మెల్యే వీరంగం

ఎంఐఎంకు చెందిన కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ బంజారాహిల్స్ లో హల్ చల్ చేశాడు. జీహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహంతో ఊగిపోతూ వారిని నోటికివచ్చినట్టు తిట్టాడు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు రావడమే జీహెచ్ఎంసీ అధికారులు చేసినపాపం. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 3లోని ఓక గోడను కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది రావడం ఉధ్రిక్తతకు దారితీసింది. రోడ్డు ను కబ్జాచేసి గోడను నిర్మించారంటూ వచ్చిన జీహెచ్ఎంసీ సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు. గోడను కూల్చివేస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ తన అనుచరులు, స్థానికులతో కలిసి కూల్చివేత పనులను అడ్డుకున్నారు. అక్రమంగా కూల్చివేతలకు పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్యే అనుచరులు ధర్నా కు దిగగా ఎమ్మెల్యే మరింత రెచ్చిపోయారు. జీహెచ్ఎంసీ సిబ్బందిపై తిట్లదండకం అందుకున్నారు. కూల్చివేత పనులను వెంటనే నిలిపివేయాలంటూ హుకూం జారీ చేశారు. బలవంతంగా కూల్చివేతకు దిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. సిబ్బందితో పాటుగా జీహెచ్ఎంసీ అధికారలను కూడా తీవ్ర స్థాయిలో బెదిరించడంతో తప్పని పరిస్థితుల్లో వారు అక్కడి నుండి వచ్చేశారు.
నియమనిబంధనలు ఏమాత్రం పట్టని మజ్జీస్ శాసనసభ్యులకు, నేతలకు అధికారులను బెదిరించడం మామూలే. స్థానికుల అండ చూసుకుని అధికారులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మజ్లీస్ ప్రజా ప్రతినిధులు అనేక సార్లు అధికారులపై దాడులకు సైతం పాల్పడ్డారు. తాజా ఘటనలో రోడ్డును కబ్జాచేసి గోడను నిర్మించారని అధికారులు ఎంత చెప్పినా పట్టించుకోని కౌసర్ అధికారులపైనే విమర్శలకు దిగి వారినే బెదిరించడంతో ఏమీ చేయలేని స్థితికి ప్రభుత్వ అధికారులు చేరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *