నీళ్లు లేక…వైధ్యం దొరక్కా… గిరిజన గ్రామాల ధైన్యం.

గుక్కెడు నీళ్ల కోసం కిలోమీటర్ల ప్రయాణం… మంచి నీరు లభించకే మురికినీటి వాడకం… వర్షాకాలంలో కలుషిత నీరు తాగి ప్రాణం మీదికి తెచ్చుకుంటున్న వైనం… ఇప్పటికీ నాటు వైధ్యం పైనే ఆధారం… ఇవి విశాఖ మన్యం గ్రామాల్లోని గిరిజనుల దుస్తితి. విశాఖ మన్యంలోని పలు గిరిజన గూడాల్లో మంచినీరు దొరక్క ఇక్కడి గిరిజనలు నానా అగచాట్లు పడుతున్నారు. మంచినీరు అందుబాటులో లేకపోవడంతో అందుబాటులో ఉన్న నీటితోనే సరిపుచ్చుకుంటున్నారు. వర్షాలకు నీరు కలుషితం కావడంతో డయేరియా లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. వైద్య సౌకర్యం లేకపోవడం ఉన్నా ఆధునిక వైద్యం పట్ల గిరిజనులకు  పెద్దగా నమ్మకం లేకపోవడంతో నాటు వైద్యంతోనే కాలం వెల్లబుచ్చుతున్నారు. దీనితో విశాఖ మన్యం పరిధిలోని చాపరాయిలో ఇటీవల మూడు వారాల వ్యవధిలో 16 మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా దయేరియా వల్ల ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు గుర్తించారు. గిరిజన గ్రామాల్లో సౌకర్యాల లేమి కొట్టోచ్చినట్టు కనిపిస్తోంది. నాగరిక ప్రపంచానికి దూరంగా ఉండే ఈ గిరిపుత్రులు కనీస సౌకర్యాలకు దూరంగా కాలం వెల్లదీస్తున్నారు. కనీస వైద్య సదుపాయాలు లేక నాటు వైద్యులను నమ్ముకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
విశాఖ మన్యంలోని దాదాపు ఐదు వేలకు పైగా గిరిజనల గ్రామాల్లోని పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో  సమీక్ష నిర్వహించారు. 7 ఐటిడీఏ పరిధిలోని గిరిజన గ్రామాల ప్రజల ఆరోగ్య స్థితిగతులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 16 మంది గిరిజనులు చనిపోయేంత దారుణ పరిస్థితులు ఎందుకు ఎదురయ్యాయని అదికారులను చంద్రబాబు నిలదీశారు. సత్వరం చర్యలు తీసుకుని ఎటువంటి ప్రాణనష్టం లేకుండా చూడాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *