రాష్ట్రపతి ఎన్నికల్లో కుల ప్రస్తావన సరికాదు:మీరా

రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కుల ప్రస్తావన అవసరమైన దానికంటే ఎక్కువగా వస్తోందని విపక్షాల తరపున రాష్ట్రపతి పదవికి పోటీపడుతున్న మీరా కుమార్ అన్నారు. గతంలో ఎన్నోసార్లు రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయని అయితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఎన్నికల్లో కుల ప్రస్తావన ఎక్కువగా ఉందని ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిగా 17 పార్టీలు తనపై నమ్మకం ఉంచడం ఆనందం కలిగిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఇద్దరు దళితులు పోటీ పడడం హర్షణీయమన్న ఆమె కుల దళితులు మధ్య పోటీ అంటూ కుల ప్రస్తావన ఎక్కువ తేవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరు దళితుల మధ్య కన్నా రెండు భిన్న పక్షాల మధ్య పోటీగా ఆమె అభివర్ణించారు. ఓడిపోతారని తెలిసినా పోటీగి దిగుతున్నారంటూ చేస్తున్న ప్రచారం పై మీరా కుమార్ స్పందిస్తూ తాను గెలవడానికే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. ఎన్నికలు అంటే తప్పకుండా పోటీ ఉంటుంది కదా అని మీరా కుమార్ అన్నారు.
దేశ అత్యన్నత పదవికోసం జరుగుతున్న పోటీ హుందాగా ఉండాలని కోరుకుంటున్నట్టు మీరా కుమార్ పేర్కొన్నారు. గుజరాత్ లోని సబర్మతీ ఆశ్రమం నుండి తాను ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టు మీరా కుమార్ వెల్లడించారు. బుధవారం నామినేషన్ వేసిన తరువాత పవిత్ర సబర్మతి ఆశ్రమం నుండి తన ప్రచారం ప్రారంభమవుతుందన్నారు. దేశ ప్రజలందరికీ సబర్మతి ఆశ్రమం అత్యంత పవిత్రమైందని అక్కడి నుండే తన ప్రచారాన్ని మొదలు పెట్టనున్నట్టు ఆమె వివరించారు. తాను స్పీకర్ గా పనిచేసినంత కాలం అందరికీ సమన్యాయం చేశానని తాను పదవిలో ఉన్నంత కాలం ఎవరూ తనపై విమర్శలు చేయలేదని తాను రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న సమయంలో తనపై విమర్శలకు దిగడం సరికాదని మీరా కుమార్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *