కోర్టు వివాదంలో సివిల్ ర్యాంకర్ రోణంకి

0
72

జాతీయ స్థాయి సివిల్స్ పరీక్షల్లో 3వ ర్యాంకును సాధించడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన రోణంకి గోపాకృష్ణపై వివాదాలు ముసురుకుంటున్నాయి. తన అంగవైకల్యానికి సంబంధించి రోణంకి సమర్పించిన  సర్టిఫికెట్లపై అనుమానం వ్యక్తం చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. సివిల్స్ లో జాతీయ స్థాయి ర్యాంకును సాధించడం ద్వారా రోణంకి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత అతనికి సంబంధించిన పలు ఆశక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీకాకుళం జిల్లా పలాస మండలానికి చెందిన రోణంకి కుటుంబానికి గ్రామస్థులకు మధ్య ఉన్న వివాదం, గ్రామస్థులు వీరి కుటుంబాన్ని వెలివేయడానికి సంబంధించి పలు విషయాలు ఆశక్తిని కలిగించాయి. దాని తరువాత ఒక ప్రముఖ సివిల్స్ కోచింగ్ సెంటర్ రోణంకి తన విద్యార్థినిగా పేర్కొనడం కూడా వివాదం రేపింది. రోణంకి గోపాలకృష్ణ తమ విద్యార్థిగా పేర్కొంటూ సదరు సంస్థ ఇచ్చిన ప్రకటన దుమారాన్ని రేపింది. అయితే తాను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదని రోణంకి మీడియాకు స్పష్టం చేశాడు. కేవలం మాక్ ఇంటర్వ్యూలకు కొన్ని సంస్థలకు వెళ్లాను తప్ప ఎక్కడా కోచింగ్ తీసుకోలేదని ఆయన చెప్పడంతో సదరు సంస్థపై విమర్శలు వెల్లవెత్తాయి.
సివిల్ ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ కోర్టు కేసుతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఇతర వెనుకబడిన కులానికి (ఓబీసీ) కి చెందిన గోపాలకృష్ణ ఆ కేటగిరిగీ కావాల్సిన కనీస మార్కులను సంపాదించుకోలేకపోయాడని ఓబీసీ కేటగిరిలో మెయిన్స్ కు అర్హత సాధించడానికి 110.66 మార్కులు రావాల్సి ఉండగా గోపాల కృష్ణకు 91.34 మార్కులు మాత్రమే వచ్చాయని అయితే వికలాంగుల కోటా  కింద అర్హత మార్కులు 75.34 గా ఉండడం వల్ల గోపాలకృష్ణ మోయిన్స్ కు అర్హత సాధించారని ఆ పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే తనకు 45 శాతం అంగవైకల్యం ఉందంటూ రోణంకి ఇచ్చిన పత్రాలను పరిశీలించాల్సిందిగా ఈ పిటిషన్ లో అభ్యర్థించారు. గోపాలకృష్ణ వైకల్యానికి సంబంధించి పిటీషనర్ అనుమానాలు వ్యక్తం చేశారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here