భారత్-చైనా సరిహద్దుల్లో ఉధ్రిక్తత

భారత్ – చైనా సరిహద్దుల్లో ఉధ్రిక్తత నెలకొంది. చైనా బలగాలు భారత భూబాగంలోకి చొరబడ్డాయి. భారత జవాన్ల పై బలప్రయోగం చేసి రెండు బంకర్లను నాశనం చేశాయి. దీనితో భారత్-చైనా సరిహద్దుల్లో ఉధ్రిక్త నెలకొంది. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి అదనపు బలగాలను తరలిస్తున్నారు. సిక్కిం సెక్టర్ లోని దకోలా వద్ద ఈ ఘటన జరిగింది. గత పది రోజులుగా ఈ ప్రాంతంలో చైనా బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నాయని సైనికాధికారులు వెళ్లడించారు. భారత భూబాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన చైనా సైనికులను మన బలగాలు నిలువరించాయని సైనిక వర్గాలు పేర్కొన్నాయి. భారత్ నుండి మానస సరోవర యాత్రకు వెళ్తున్న యాత్రికులను కూడా చైనా సైన్యం అడ్డుకుంది.

పదిరోజుల నుండి ఇరు సైన్యాలు ముఖాముఖి తలపడినా ఈ రోజు చైనా సైనికులు రెచ్చిపోయారు. అదనపు బలగాల సహాయంతో ఒక్కసారిగా భారత భుబాగంలోకి చొరబడిన చైనా మన సైన్యాన్ని వెనక్కి నెట్టివేసి రెండు బంకర్లను నాశనం చేసింది. బంకర్లను ద్వంసం చేసిన తరువాత చైనా తిరిగి తమ స్థావరాలకు వెళ్లిపోయింది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతానికి భారత్ అదనపు బలగాలను తరలిస్తోంది. ఇటీవల కాలంలో చైనా భారత్ ను రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. హఠాత్తుగా భారత భూబాగాల్లో చొరబడడం లాంటి కవ్వింపు చర్యలకు దిగుతోంది.