భారత టిబెటన్లకు కొత్త సమస్యలు

    భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న దాదాపు లక్షన్నర మంది టిబెటన్లవిషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారిని ఇబ్బందుల్లోకి నెడుతోంది. సిమ్లాలోని ధర్శశాల నుండి కర్ణాటక దాకా దాదాపు 35 సెటిల్ మెంట్లలో దాదాపు లక్షన్నర మంది టిబెటన్లు నివసిస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వీరంతా పొట్టపోసుకుంటున్నారు. టిబెట్ ను చైనా ఆక్రమించుకోవడంతో అక్కడి నుండి వలస వచ్చిన వీరికి భారత్ ఆశ్రయం కల్పించింది. సంవత్సరాలుగా వీరంతా భారత్ లోనే ఉంటున్నారు. ధర్మశాలలో ఉన్న సెంట్రల్ టిబెట్ అడ్మినిస్టేషన్ (సీటీఏ) వీరి బాగోగులను చూస్తుంటుంది. రాజకీయ ఆశ్రయం పొందుతున్న వీరికి భారత ప్రభుత్వం చాలా కాలంగా అనేక రాయితీలను కల్పిస్తూ వస్తోంది.
కేంద్ర ప్రభుత్వం తాగాజా తీసుకున్న తీసుకున్న నిర్ణయం తమను ఇబ్బందుల్లోకి నెడుతోందని టిబెటన్లు వాపోతున్నారు. భారత పాస్ పోస్టుకోసం ధరఖాస్తు చేసుకునే టిబెటన్లు వారి సెటిల్ మెంట్ల నుండి బయటికి రావాలనే నిబంధన తమను ఇబ్బందుల్లోకి నెడుతోందని వారు అంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 35 సెటిల్ మెంట్లలో తాము నివసిస్తున్నామని ఇప్పుడు అక్కడి నుండి బయటికి వస్తేనే పాస్ పోర్టు కు అర్హలంటూ పెట్టిన నిబంధన పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనితో పాటుగా రాజకీయ ఆశ్రయం వల్ల కలుగుతున్న ప్రయోజనాలను కూడా వదులుకోవాలనే షరుతు కూడా పెడుతున్నారని వారు చెప్తున్నారు. గతంలో ఒక సారి నిరాశ్రయిలుగా మారిన తాము మరోసారి నిరాశ్రయులుగా మారాల్సి వస్తోందని అంటున్నారు. హోదాను వదులు కుంటే ప్రత్యేక రాయితీలు ఏవీ రావని వారు వాపోతున్నారు.
భారత్ లో రాజకీయ ఆశ్రయం పొందుతున్న వారికి జనవరి 26  1950 నుండి జులై 1 1987 ల మధ్య జన్మించిన టిబెటన్లకు అందరికీ భారత పౌరసత్వం ఇవ్వాలని ఢిల్లీ హై కోర్టు తీర్పు చెప్పింది. రాజ్యాంగం ప్రకారం వారు జన్మతా భారత పౌరులని కోర్టు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం వల్ల తాము పాస్ పోర్టు పొందడం ద్వారా ఎక్కువ నష్టపోవాల్సి వస్తోందని టిబెటన్లు వాపోతున్నారు.
 
 

 

 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *