దొరికిన మాజీ ఎమ్మెల్యే ఆచూకీ

kunja biksham

తిరుమలలో తప్పిపోయిన మాజీ ఎమ్మెల్యే ఆచూకి లభించింది.  బూర్గంపాడు నియోజకవర్గం నుండి ముడు సార్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన గిరిజన నేత కుంజా భిక్షం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చి అక్కడ తప్పిపోయారు. ప్రస్తుతం ఆయన మతిమరుకు వ్యాధితో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు బిక్షం ను కరకంబాడి వద్ద గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని బయటకు వస్తున్న క్రమంలో భిక్షం కుటుంబ సభ్యుల నుండి దూరం అయి తప్పిపోయారు. ఆయన కోసం కొండపై చాలా సేపు వెతికిన కుటుంబ సభ్యులు ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మతిమరుపు వ్యాధితో భాదపడతున్న ఆయన్ను గుర్తించేందుకు పోలీసులు చాలా శ్రమించి ఎట్టకేలకు ఆచూకీ పట్టగలిగారు.

కుటుంబ సభ్యుల నుండి దూరం అయి రెండు రోజుల పాటు ఏమీ తినక నీరసించి పోయిన ఆయన్ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. సీపీఐ పార్టీ కి నుండి మూడు సార్లు నాటి ఖమ్మం జిల్లా బూర్గంపాడు నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేసిన భిక్షం గిరిజన హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారు.