25న గోల్కొండ బోనాలు

ఆషాడ మాసం మొదలవడంతో హైదరాబాద్ లో బోనాల సందడి నెలకొంది. ఈనెల 25న గోల్గొండ బోనాలు ప్రారంభమవుతాయి. అటు తరువాత సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, తర్వాత పాతబస్తీ లాల్ దర్వాజా బోనాలు జరుగుతాయి. ఈ బోనాల ఉత్సవాల్లో లక్షలాది మంది ప్రజలు పాల్గొంటారు. పోతరాజుల హంగామాతో బోనాల సందడి నగరంలోని వాడవాడలా కనిపిస్తుంది. బోనాలు ఘటాల ఊరేగింపులతో నగరమంతటా సందడి వాతావరణం నెలకొంటుంది.

బోనాల పండుగకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. బోనాల పండుగను పురస్కరించుకుని మంత్రి పోలీసు, రెవన్యూ శాఖలతో పాటుగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. బోనాల పండుగల సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. పండుగ ఏర్పాట్లలో ఎటువంటి నిధుల కొరత రానీయమని మంత్రి తెలిపారు. బోనాల పండుగ కోసం 10కోట్ల రూపాయలను విడుదల చేసినట్టు మంత్రి వెల్లడించారు.