ఆ వెధవలకు దేశంలో ఉండే అర్హత ఉందా…

‘భారత్ లోని ముస్లీంల దేశభక్తిని శంకిస్తున్నారు’. ‘మమ్మల్ని దేశ ద్రోహులుగా చిత్రీకరించడం సరికాదు’. ఓ ముస్లీం సంస్థ ప్రకటన ఇది. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వారిపై కేసులు పెడితే  వారికి వత్తాస పలకడంతో పాటుగా తమను వేధిస్తున్నారంటూ నిస్సిగ్గుగా సదరు ముస్లీం సంస్థ చేసిన ప్రకటన ఇది.   భారత్ –పాక్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా భారత్ ఓటమి చెందిన తరువాత పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో పాటుగా బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్న వారిపై కేసులు పెట్టడం తప్పయినట్టు మాట్లాడుతున్న వారిని ఏమనాలి… కనీసం సిగ్గూ శరం లేకుండా  వారికి మద్దతు పలకడం దారుణం. భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడిని వీరిపై దేశద్రోహం కేసు పెట్టడం సరికాదట. ఏవే చిన్న చిన్న కేసులు పెట్టి వదిలేయాలట. మరి వారు చేసిన పనే చిన్నది కాదే. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం… అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టడం ఇట్లా ఎంత చెప్పుకున్నా తక్కువే. స్వదేశం ఓడితే సంబరాలు చేసుకోవడం ఏంటి.. ఇది దేశద్రోహం కిందికి రాదా… కొంత మంది వెధవలు చేసిన పిచ్చిపనికి దేశంలోని ముస్లీంలందరికీ ఎవరూ అన్వయించలేదు. ముస్లీంల దేశభక్తిని ఎవరూ శంకించలేదు. సిగ్గుమాలిన పనిచేసిన వారిపైనే కేసులు పెట్టారు. అది తప్పయినట్టు చేస్తున్న ప్రకటనలు దానికి దేశంలోని ముస్లీంలు అందరూ బాధపడుతున్నారంటూ చెప్తున్న మాటలు చూస్తుంటే ఏవగింపు కలుగుతోంది.
పాకిస్థాన్ జెండాల ప్రదర్శన జమ్ము కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల్లో నిత్యకృత్యం అయింది. దేశంలోని మిగతా ప్రాంతాల్లోనూ ఇటువంటి ఘటనలు అడపా దడపా జరుగుతూనే ఉన్నాయి. భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ పాత నగరంలోనూ గతంలో ఇటువంటి ఘటనలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ చర్యలను మొగ్గలోనే తుంచాల్సిన అవసరం ఎంతైనా  ఉంది. పాకిస్థాన్ జెండాలు పట్టుకుని ఆదేశానికి అనుకూలంగా నినాదాలు చేయడం ఖచ్చితంగా తప్పే. ఇది ఆకతాయి తనంగా చేసిన పనిగా చెప్పుకోవడం దారుణం. ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా కొంత మందిని రెచ్చగొట్టేందుకు చేసిన పనే. పాకిస్థాన్ జెండాలు పట్టుకున్న కొంత మంది వెధవలు దేశంలోని ముస్లీంలందరికీ ఎంత మాత్రం ప్రతినిధులు కాదు. దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు భారతీయులందరి లాగానే ముస్లీంలు కూడా ఎప్పుడూ వెనుకాడరు. అయితే కొంత మంది చేస్తున్న అతి చేష్టలు చాలా మందిని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. క్రికెట్ మ్యాచ్ ఓడినంత మాత్రనా వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ భారత్ ఓడిపోతే సంబరాలు చేసుకునే వారి నీచ బుద్ది బయటపడింది. అటువారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.
ఈ దేశ నీళ్లు తాగుతూ… ఈ దేశ అన్నం తింటూ ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలను అనుభవిస్తున్న  ఈ వెధవలు పక్క దేశానికి మద్దతు పలకడం నిజంగా దుర్మార్గం. వారికి అసలు ఈ దేశంలో ఉండే అర్హత ఉందా…
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *