కొత్త కోచ్ గా రవిశాస్త్రి…?

భారత క్రికెట్ జట్టు కోచ్ గా రవిశాస్త్రికి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోచ్ పదవి నుండి కుంబ్లే అర్థాంతరంగా వైదొలిగిన నేపధ్యంలో భారత క్రికెట్ జట్టు కోచ్ గా బాధ్యతలను బీసీసీఐ ఎవరికి అప్పగిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కోచ్ పదవికోసం దరఖాస్తులను ఆహ్వానించిన బీసీసీఐ మరోసారి కోచ్ పదవికోసం ధరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించింది. రవిశాస్త్రిని ఎంపిక చేయడం కోసమే మరోసారి దరఖాస్తులను అహ్వానించాలని బీసీసీఐ నిర్ణయించినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ పదవి కోసం మాజీ ఆటగాడు వీరేంద్ర సేహ్వాగ్ తో పాటుగా పలువురు ధరఖాస్తు చేసుకున్నారు. అయితే తాగాజా మరోసార కోచ్ పదవికోసం అప్లికేషన్లను ఆహ్వానించడం రవిశాస్త్రిని కోచ్ ను గా నియమించడం కోసమేనని తెలుస్తోంది.
భారత క్రికెట్ జట్టుకు ఎవరు కోచ్ గా ఉండాలనేది సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలి, వీవీఎస్ లక్ష్మణ్ లతో కూటిని త్రిసభ్య బృందం నిర్ణయిస్తుంది. ఈ కమిటీలో గంగూలి మొదటి నుండి రవిశాస్త్రి ఎంపికను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. గంతంలోనూ రవిశాస్త్రి ఎంపిక లాంఛనమేనని అనుకున్న సమయంలో గంగూలి అనూహ్యంగా కుంబ్లేను తెరపైకి తీసుకుని వచ్చాడు. దీనితో రవిశాస్త్రి- గంగూలి మధ్య విభేదాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఇద్దరు బహిరంగంగానే ఒకరిపై ఒకరు అహనం వ్యక్తం చేసుకున్నారు. కుంబ్లేకు-కెప్టెన్ విరాట్ కోహ్లీకి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో కుంబ్లే తన పదవిని అర్థంకరంగా వదులుకున్నారు. దీనితో ప్రధాన కోచ్ లేకుండానే భారత జట్ట వెస్ట్ ఇండీస్ పర్యటనకు బయలుదేరి వెళ్లింది.
రవిశాస్త్రికి కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతు పుష్కలంగా ఉంది. రవిశాస్త్రిని కోచ్ గా నియమించాలని కోహ్లీ కోరుతున్నట్టు తెలుస్తోంది. రవిశాస్త్రి విషయంలో గంగూలీ కూడా కాస్త మెత్తబడినట్టు సమాచారం. ఈ నేపధ్యంలో రవిశాస్త్రినే కోచ్ గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు క్రికెట్ వర్గాల కథనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *