సౌదీలో కొత్త పన్ను-భారతీయుల్లో ఆందోళన

సౌదీ అరేబియా ప్రభుత్వం కొత్తగా తీసుకుని వచ్చిన చట్టం అక్కడి భారతీయుల్లో గుబులు రేపుతోంది. ఫ్యామిలీ ట్యాక్స్ పేరుతో సౌదీ ప్రభుత్వం జులై ఒకటవ తేదీ నుండి కొన్ను పన్ను విధానాన్ని తీసుకుని వచ్చింది. డిపెండెంట్ ఫీజు పేరుతో ఉద్యోగం చేయని వారి నుండి నెలకు 100 రియాల్స్ వసూలు చేయాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించింది. నలుగురు ఉన్న కుటుంబంలో ఒకరు ఉద్యోగం చేస్తుంటే మిగతా ముగ్గురికి తలా 100 రియాల్స్ చొప్పున నెలకు 300 రియాల్స్ కట్టాల్సి ఉంటుంది. అంటే ప్రతీ కుటుబంపై నెలకు ఐదువేలకు పైగా భారం పడుతోంది. ఒక్కసారిగా నెలకు ఐదు వేల రూపాయల భారం వేయడం పై ఇక్కడ పనిచేస్తున్న భారతీయులు అందోళన చెందుతున్నారు.
సౌదీ అరేబియాలో దాదాపు 41 లక్షల మంది బారతీయులు ఉన్నారు. వీరిలో అధిక శాతం మంది చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. వీరిపై ఒక్కసారిగా నెలకు ఐదు వేల రూపాయల భారం పడడంతో వీరు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి దేశంగాని దేశంలో పని చేస్తున్నామని నాలుగు రాళ్లు వెనకేసుకుందామని ఇంత దూరం వస్తే ఇప్పుడు పన్నుల పేరుతో తమ వద్ద ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారని వారు వాపోతున్నారు. ఈ భారాన్ని భరించలేక కొందరు ఇప్పటికే తమ కుటుంబ సభ్యులను స్వదేశానికి పంపేస్తున్నారు. సౌదీలో కుటుంభాన్ని పోషించడం భారంగా మారిందని దానికి తోడు పన్నుల భారం పెరిగిపోవడంతో ఇంత దూరం వచ్చి లాభం లేకుండా పోయిందని అంటున్నారు. ప్యామిలీ  ట్యాక్స్ ను తప్పించుకోవడం  కోసం తమ కుటుంబ సభ్యులను స్వదేశానికి పంపేస్తున్నారు. దీని వల్ల ఫ్యామిలీ ట్యాక్స్ తగ్గడంతో పాటుగా కుటుంబ నిర్వహణ భారం కూడా గణనీయంగా తగ్గుతుందని అంటున్నారు. తప్పని పరిస్థితుల్లో బ్రహ్మచారులుగా మారిపోతున్నామని వారంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *