అటవీశాఖలో ఉద్యోగాల భర్తీ

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి నడుంకట్టిన ప్రభుత్వం తాగాగా అటవీ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1857 బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖలో భారీ గా ఖాళీలను పూరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి చర్యలు ప్రారంభించింది. బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో నిరుద్యోగులకు మరో తీపి కబురు అందినట్టయింది. వివిధ ఉద్యోగాల ఖాళీలను భర్తీలను పూరించేందుకు ప్రభుత్వం కసరత్తులు చోస్తోంది.