లండన్ లో మరో కలకలం

వరుస ఘటనలతో లండన్ గడగడలాడుతోంది. తాజాగా ఒక వ్యాన్ పాదచారులపైకి దూసుకునిపోయింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా 10 మందికి పైగా గాయపడ్డారు. లండన్ ఫిన్స్ బరీ పార్క్ సెవెన్ సిస్టర్స్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. స్థానిక మసీదు సమీపంలోని ఫుట్ పాత్ పైకి వచ్చిన వ్యాన్ అక్కడి పాదచారలను  ఢీ కొట్టింది. ఒకరు ఘటనా స్థలంలోనే ప్రణాలు కోల్పోగా 10 మందికి గాయాలు అయ్యాయి. రాత్రి 12.30 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మసీదు నుండి తరావీ ప్రార్థనల తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే లండన్ వంతెన వద్ద ఉగ్రవాదులు విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *