ముంబై పేలుళ్ల కేసులో శిక్షలు ఖరారు

ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో టాడా కోర్టు తీర్పును వెలువరించింది. దేశ ఆర్థిక రాజధానిని అతలాకుతలం చేసిన 1993 వరుస బాంబు పేలుళ్ల ఘటనలో టాడా కోర్టు అబు సలెం, ముస్తాఫా దోసా తో సహా ఆరుగురిని దోషులుగా నిర్థారిస్తూ తీర్పు వెలువరించింది. సాక్షాధారాలు లేకపోవడంతో అబ్దుల్ ఖయ్యూమ్ నిర్థోషిగా కోర్టు తేల్చింది. హత్య, ఉగ్రవాద కార్యకలాపాలతో పాటుగా పలు నేరాల కింద వీరిని కోర్టు దోషులుగా నిర్థరించింది. వీరికి త్వరలోనే శిక్షలను కోర్టు ఖరారు చేస్తుంది. 1993లో జరిగిన ఈ బాంబు పేలుళ్లలో 257 మంది ప్రాణాలు కోల్పోగా 700 మంది గాయపడ్డారు. దేశ ఆర్థిక రాజధానిలోని 12  చోట్ల బాంబులు అమర్చి పేల్చారు. ఆర్డీఎక్స్ ను వినియోగించి ఈ పేలుళ్లు జరిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న యాకుబ్ మెనన్ ను 2015లో ఉరితీశారు. 2013లో మెనన్ కు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించగా 2015 జులై 30 శిక్షను అమలు చేశారు. ఈ పేలుళ్లకు సంబంధించి 2007లో టాడా కోర్టు తొలి దశ విచారణ పూర్తి చేసింది. ఇందులో మొత్తం 100 నిందితులుగా గుర్తించారు. ఆటు తరువాత ప్రస్తుతం శిక్ష పడ్డ కీలక నిందితులపై విచారణ మొదలైంది. కొన్ని కారణాల వల్ల 2007 లో విచారణ నిల్చిపోయి 2012లో తిరిగి ప్రారంభం అయింది.