అసలేం జరిగింది…వెల్లడించిన కమీషనర్

బ్యూటిషియన్ శిరీష మృతి మిస్టరీ వీడింది. శిరీషది ఆత్మహత్యగానే పోలీసులు తేల్చారు. ఈ కేసులో అరెస్టయిన రాజీవ్, శ్రవణ్ లను మీడియా ముందుకు తీసుకుని వచ్చారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి శిరీష మరణమిస్టరీకి సబంధించిన వివరాలను వెల్లడించారు. పశ్చిమ గోదావరికి చెందిన విజయలక్ష్మి అలియాస్ శిరీష ఉపాధికోసం నగరానికి వచ్చింది.13 సంవత్సరాల క్రింతం శిరీషకు వివాహం జరగ్గా 12 సంవత్సరాల కూతురు ఉంది.  భర్త చిరుద్యోగి.  ఇక్కడ ఒక దుకాణం నిర్వహించగా సరిగా లాభాలు రాకపోవడంతో దాన్ని మూసేసింది. అటు తర్వాత బ్యూటీషియన్ కోర్సును నేర్చుకున్న ఆవిడ పెళ్లిళ్లలో మేకప్ లు చేస్తుండేది. ఈ క్రమంలోనే రాజీవ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆర్.జే.ఫొటో స్టూడియోను నిర్వహిస్తున్న ఇతనికి నగరంలో రెండు స్టూడియోలు ఉన్నాయి. ఎక్కువగా పెళ్లివేడుకల ఫొటోలు తీసే రాజీవ్ కు శిరీష కు మధ్య స్నేహం కుదరడంతో ఆర్.జె. స్టూడియోలోనే శిరీష మేనేజర్ గా పనిచేస్తోంది. పెళ్లిల్లలో మేకప్ లు కూడా వేస్తుండేది. శిరీష కు రాజీవ్ కు మధ్య స్నేహం వివాహేతర సంబంధానికి  దారితీసింది. ఇదిలా ఉండగా రాజీవ్ కు బెంగళూరకు చెందిన తేజస్విని ఒక యువతితో పరిచయం ఏర్పడింది. అమెతో శారీరక సంబంధం పెట్టుకున్న రాజీవ్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.
బెంగళూరు నుండి హైదరాబాద్ కు వచ్చిన తేజస్వినికి రాజీవ్-శిరీషలు సన్నిహితంగా మెలగడాన్ని సహించలేకపోయింది. తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో సన్నిహితంగా ఉండడం మానుకోవాలంటూ శిరీషను హెచ్చరించింది. వీరిద్దరి మధ్య వివాదం ముదరడంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. తనకు తేజస్విని, రాజీవ్ ల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించాలంటూ మాల్  కు చెందిన శ్రవణ్ సహాయాన్ని శిరీష కోరింది. శ్రవణ్ కు పరిచయం ఉన్న ఎస్.ఐ ప్రభాకర్ రెడ్డి సహాయంతో వివాదాన్ని పరిష్కరించుకోవాలని శ్రవణ్ శిరీషకు సూచించాడు. ఈ విషయమై ఎస్.ఐ ప్రభాకర్ రెడ్డిని కోరగా అతను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం ఎస్.ఐగా ఉన్న వీరేందర్ ను కలవాలసి సూచించగా వీరు వీరేందర్ ను కలిశారు. అయితే కుటుంబ వ్యవహారం కావడంతో కొంత సమయం అడిగిన వీరేందర్ ప్రస్తుతానికి ఎటువంటి కేసులు లేకుండా రాజీ చేసుకోవాలని సూచించాడు.
ఆరోజు ఏం జరిగింది:
శిరీష ఆత్మహత్యకు పాల్పడిన రోజు శిరీష,శ్రవణ్, రాజీవ్ లు వివాదం ఏ విధంగా పరిష్కరించుకోవాలనే విషయంపై చాలా సేపు మాట్లాడుకున్నారు. ఒక కాఫీ షాప్ లో వీరు చాలా సేపు మాట్లాడిన తరువాత కూకనూరు ఎస్.ఐ. ప్రభాకర్ రెడ్డి సమక్షంలో మాట్లాడుదామంటూ వీర ముగ్గురూ కూకనూరుకు బయలు దేరరు. ఈ మధ్యలో జూబ్లీహీల్స్ లోని ఒక మధ్య దుకాణంలో మధ్యం సీసాను కొనుగోలు చేసి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు అక్కడి నుండి వీరు ముగ్గురితో పాటుగా ప్రభాకర్ రెడ్డి నలుగురూ కలిసి ఆయన క్వాటర్స్ కు చేరుకున్నారు. అందులో నలుగురూ కలిసి మధ్యం సేవించారు. మధ్యలో శ్రీనివాస్ రెడ్డి,  రాజీవ్, శ్రవణ్ లు సిగరెట్ కోసం బయటకు రాగా వారి మధ్య స్థానికంగా వ్యభిచారులకు సంబంధించిన చర్చ రాగా అక్కడికి వెళ్లి వీరిద్దరినీ ఏంజాయ్ చేయమని ఎస్.ఐ సూచించారు. ఈ విషయాన్ని విన్న శిరీష్ వెంటనే అక్కడి నుండి వెల్లిపోవాలంటూ ఒత్తిడి మొదలు పెట్టిందని ఆ తరువాత తిరిగి నలుగురూ మధ్యం సేవించారు. ఈ క్రమంలో తిరిగి రాజీవ్, శ్రవణ్ లు బయటు వెళ్లగా శ్రీనివాస్ రెడ్డి శిరీష పట్ల అసభ్యంగా ప్రవర్తించగా ఆమె భయంతో గట్టిగా అరిచింది. ఆమెను అరవకుండా ఉంచేందుకు శ్రీనివాస్ రెడ్డి, శ్రవణ్, రాజీవ్ లు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో రాజీవ్ ఆమెపై చేయి చేసుకున్నాడు. దీనితో అక్కడి నుండి వెళ్లిపోవాల్సిందిగా ఎస్.ఐ.శ్రీనివాస్ రెడ్డి ఆ ముగ్గురిని పంపేశాడు.
హైదరాబాద్ కు వస్తున్న దారిలో కూడా శిరీష గట్టిగా అరవడం కేకలు పెట్టడంతో రాజీవ్ ఆమెపై మరోసారి చేయిచేసుకున్నాడు. హైదరాబాద్ కు వచ్చిన తరువాత రాజీవ్ స్టూడియోకి వచ్చిన శిరీష కారు ఆగంగానే స్టూడియోకి వెళ్లిపోయి తలుపులు వేసుకుంది. కొద్ది సేపటి తరువాత రాజీవ్ కు కాల్ చేసినా అతను స్పందించలేదు. తెల్లవారు జామున 3.50 ప్రాంతంలో శిరీష ఆత్మహత్యకు పాల్పడింది. దీనితో కంగారు పడ్డ రాజీవ్ పోలీసులకు సమాచారం అందిచాడు. శిరీష, రాజీవ్, శ్రవణ్ లు హైదరాబాద్ వస్తున్న సమయంలోనే ఎస్.ఐ శ్రీనివాస్ రెడ్డి రెండు మూడు సార్లు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకబు చేశాడు. శిరీష చనిపోయిన తరువాత కూడా ఎస్.ఐ బంజారాహిల్స్ ఎస్.ఐ ద్వారా కేసు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. శిరీష్ కాకనూరు పల్లికి వచ్చిన విషయం తెలిసిపోవడంతో శ్రీనివాస్ రెడ్డి ఆ తరువాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *