బాంగ్లా చిత్తు ఫైనల్స్ లోకి భారత్

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లోకి భారత్ దూసుకెళ్లింది. భారత్ ఫైనల్స్ లో దాయాదీ పాకిస్థాన్ తో తలపడనుంది. సెమీస్ భారత్ బాంగ్లాదేశ్ ను చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బాంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 264 పరుగులు చేయగా భారత్ 40.1 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ ను కోల్పోయి భారత్ లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ 123(నాటౌట్) పరుగులు చేయగా కెప్టెన్ విరాట్ కోహ్లీ 96 (నాటౌట్) పరుగులు చేశాడు. బాంగ్లాపై అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ బాంగ్లాను సెమీస్ లో చిత్తు చేసింది.