లండన్ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణం…?

లండన్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.  ఈ అగ్నిప్రమాదం ఘటన వెనుక కుట్రకోణం ఏదైనా ఉందనే దిశలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం రాత్రి లండన్ లోని 24 అంతస్తుల భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 12 మంది ప్రాణాలో కోల్పోగా 74 మంది గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. అయితే ఈ అగ్ని ప్రమాదం ఎట్లా జరిగిందనే దానిపై పోలీసులు కారణాలు అన్వేషిస్తున్నారు. భవనంలో ఓ ఇంట్లో ప్రిడ్జ్ పేలిపోయి ఈ దారుణం జరిగిందని ప్రాథమిక సమాచారన్ని బట్టి తెలిసినా ఇందులో కుట్రకోణం కూడా లేకపోయే అవకాశాలు లేకపోలేదని పోలీసులు భావిస్తున్నారు. దీనితో ఈ దిశగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాన్ని బట్టి కూడా కుట్రకోణం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రిడ్జ్ పేలిపోయిన ఇంటి యజమాని తన ఇంట్లోని సామాన్లు సర్థుకుని బయటకు వెళ్తూ అగ్ని ప్రమాదంపై పక్కింటి వారికి చెప్పాడని అంటున్నారు. వారు వచ్చి చూసేటప్పటికే మంటలు వ్యాపిస్తున్నాయని అగ్నిమాపక సిబ్బంది వచ్చే సరికి పూర్తిగా మంటలు భవనాన్ని చుట్టుముట్టాయని చెప్తున్నారు.
ఇంట్లో మంటలు అంటుకున్న సమయంలో తీరిగ్గా సామాన్లు సర్థుకుని పక్కవారికి సమాచారం ఇచ్చి అతను ఇళ్లు వదిలి వెళ్లిపోయాని ప్రత్యక్షసాక్షలు చెప్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగినపుడు అతను తాపీగా వ్యవహరిచండంతో పాటుగా సామాన్లు సర్థుకుని వెళ్లిపోయాడనే ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని బట్టి ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంగ్లాండ్ లో వరుగా జరుగుతున్న ఉగ్రదాడుల నేపధ్యంలో పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *