కాశ్మీర్ లో ముగ్గురు తీవ్రవాదులు హతం-జవాను వీర మరణం

జమ్ము కాశ్మీర్ లో తీవ్రవాదులకు -భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుపెట్టగా ఓ జవాను వీరమరణం పొందాడు. నౌగాం సెక్టార్ లో భద్రతా విధులు నిర్వహిస్తున్న సైన్యంపై తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సైన్యాన్ని దొంగ దెబ్బతీసేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను జవాన్లు మట్టు పెట్టారు. ఈ క్రమంలో ఒక జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఉగ్రవాదుల నుండి భారీ ఎత్తున ఆయుధాలు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

జమ్ము కాశ్మీర్ లోని యూరి సెక్టార్ వద్ద కూడా భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. భద్రతా బలగాల నుండి తప్పించుకుని పోయోందుకు చేసిన ప్రయత్నాలను వమ్ము చేసిన భద్రతా బలగాలు వారిపై భారీగా కాల్పులు జరుపుతున్నాయి.

Releated

శ్రీ రామానుజా మిషన్ ట్రస్ట్ ఆరోగ్యహారం – పేద ప్రజలకు గొప్ప వరం

చిత్తూరు జిల్లాలో “ఆరోగ్యహారం” పేరుతో శ్రీ రామానుజా మిషన్ ట్రస్ట్, శ్రీ వరాహ నర్సింహ్మస్వామి అధ్యాత్మ సమాజసేవా ట్రస్ట్ లు సంయుక్తంగా సమగ్ర వైధ్య శిభిరాలను నిర్వహిస్తున్నాయి. జిల్లాలోని మదనపల్లికి సమీపంలోని వి. కొత్తకోట కందుకూరు అగ్రహారం గ్రామంలో ప్రస్తుతం ఈ వైధ్య శిభిరాన్ని ఏర్పాటు చేసినట్టు ట్రస్టు ప్రతినిధిలు ఒక ప్రకటనలో తెలిపారు. తమ సంస్థల ఆధ్వర్యంలో పూర్తిగా సమగ్రంగా గ్రామస్థులకు ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తున్నామని శ్రీ వరాహ నర్సింహ్మస్వామి అధ్యాత్మ సేవా ట్రస్ట్ బాధ్యాలు […]

5న పోలింగ్‌.. 9న ఫలితాలు

బెంగళూరు: కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 5న పోలింగ్‌ జరగనుంది. వీటి ఫలితాలు డిసెంబర్‌ 9న విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో రేపటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది. అయితే అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు అసెంబ్లీ గడువు ముగిసే వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా స్పీకర్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో 15 ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు […]