ప్రమాదకరంగా సరూర్ నగర్ చెరువు నాలా

sar sar2

సరూర్ నగర్ చెరువు నాలా ప్రమాదకరంగా తయారయింది. సరూర్ నగర్ చెరువు నుండి బయటకు వచ్చే నీరు నాలాల ద్వారా మూసీ నదిలో కలుస్తుంది. శంకేశ్వర్ బజార్ వద్ద నాలాకు ఇరువైపులా ఉన్న ప్రహరీ గోడ కూలిపోయింది. దీనితో ఎటువంటి నాకాకు ఎటుంటి భద్రత లేకుండా పోవడంతో ఎవరైనా నాలాలో పడే ప్రమాదముందని స్థానికులు వాపోతున్నారు. సరర్ నగర్ చెరువుకు రెండు వైపుల నాలాలు ఉన్నాయి. ఒకటి సరూర్ నగర్ శారదా ధియేటర్ వద్ద, రెండవది శంకేశ్వర్ బజార్ వద్ద ఉన్నాయి. ఈ నాలల గుండా నీరు స్థానిక కాలనీల గుండా ప్రవహించి చైతన్యపురి వద్ద ప్రధాన మురుగునీటి కాలవలో కలుస్తుంది. అక్కడి నుండి ఈ నీరు మూసీకి చేరుతుంది. సరూర్ నగర్ చెరువు నుండి వచ్చే నీటి వల్ల లోతట్టు ప్రాంతాలు తరచూ మునిగిపోతూ ఉంటాయి. నాలాల పూడిక తీత పనులు కూడా సక్రమంగా జరగడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు గోడ కూలిపోవడంతో ఈ నాలా ప్రమాదకరంగా మారింది. గురువారం కురిసిన వర్షాలకు నాలాల్లో నీరు ఉధృతంగా పారుతోంది. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని నాలాకు ప్రహారిని నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.