నాగచైతన్య-సమంతల పెళ్లీ తేదీ ఖారారు

సినీ హీరోహీరోయిన్లు అక్కనేని నాగచైతన్య, సమంతల పెళ్లి ముహూర్తం ఖరారయ్యింది. అక్టోబర్ 6న వీరిద్దరి వివాహం జరగనుందని స్వయంగా నాగచైతన్యే వెల్లడించాడు. ఓ అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన మీడియా సమావేశంలో నాగచైతన్య తన పెళ్లి తేదీని వెళ్లడించాడు. ఆక్టోబర్ 6వ తేదీన తాను సమంతను వివాహం చేసుకోబోతున్నట్టు చెప్పారు. ఇప్పటికే నాగచైతన్య-సమంతల ఎంగేజ్ మెంట్ జరిగిపోయింది.” ఏంమాయచేసేవే ” చిత్ర షూటింగ్ తో స్నేహితులుగా మారిన వీరిద్దరు తరువాత పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సమంతతో తాను రొమాంటిక్ సినిమా లో కలిసి నటించేందుకు ఆశక్తిగా ఉన్నట్టు నాగ చైతన్య చెప్పాడు. తన పెళ్లికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే వెళ్లడిస్తానని పేర్కొన్నాడు. తన పెళ్లి హింధూ, క్రిస్టియన్ పద్దతుల్లో జరుగుతుందని గతంలోనే నాగ చైతన్య తెలిపాడు.