చేప మందు పంపిణీ ప్రారంభం

ప్రతీ సంవత్సరం మృగశిర కారై రోజున ఉబ్బస వ్యాధి గ్రస్తులకు ఇచ్చే చేప మందు కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్ చేప మందుగా ప్రసద్ది చెందిన చేప మందును నగరానికి చెందిన బత్తిన సోదరులు ప్రతీ ఏడాది పంపిణీ చేస్తున్నారు. సంవత్సరాలుగా ఈ కార్యక్రమం సాగుతోంది. నాంపల్లి ఎగ్సిభిషన్ గ్రౌండ్స్ లో చేపమందు కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రారంభించారు.  ఆయన స్వయంగా చేపమందును తీసుకున్నారు. చేపమందు తీసుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుండి కూడా పెద్ద సంఖ్యలో చేప మందుకోసం ప్రజలు బారులు తీరారు. చేప మందును ఇంటికి తీసుకుని వెళ్లి 45 రోజుల పాటు క్రమం తప్పకుండా వాడితే ఉబ్బస వ్యాది నయమవుతుందని ప్రజల నమ్మకం. చేప మందు కోసం వచ్చే వారికోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. వివిధ స్వచ్ఛంధ సంస్థలు మందు కోసం వచ్చే వారికి ఉచితంగా అల్పాహార, భోజన ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులతో పాటుగా స్వచ్చంధ సంస్థల కార్యకర్తలు మందుకోసం వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు కలక్కుండా చర్యలు తీసుకుంటున్నారు.
చేప మందు తీసుకున్న ముడు గంటల వరకు ఎటువంటి ఆహారం తీసుకోవద్దని నిర్వహాకులు చెప్తున్నారు. దీనితోపాటుగా 45 రోజుల పాట ఉచితంగా ఇచ్చే మందు కోసం డబ్బాలను వెంట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ మందు తీసుకుంటున్ననని రోజులు పత్యం పాటించాలని అప్పుడే మందు సక్రంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. నిర్వాహకులు సూచించిన 27 రకాల ఆహార పదార్థాలను మాత్రమే 45 రోజులు స్వీకరించాలని వారు చెప్తున్నారు. గోధుమలు, చామకూర, పొట్లకాయ,  చెక్కర, మేక మాంసం, పాలకూర, పులిచింతకూర, పొట్లకాయ, చామగడ్డ, మామిడి వరుగు, కోయికూర, అల్లం, ఉల్లిపాయలు, పసుపు, కందిపప్పు, మిరియాలు, మిరపపొడి, ఉప్పు, ఆవునెయ్యి,అంజీర్‌పండ్లు, బత్తాయిపండ్లు, ఆవుపాలతో చేసిన టీ, తెల్ల జొన్నలు, ఇడ్లీ (చట్నీలేకుండా), బ్రెడ్, బిస్కెట్, ఆవుపాల మజ్జిగ (ఇనుపముక్కను వేడిచేసి మజ్జిగలో వేసుకుని తాగాలని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *