ముద్దయిన భాగ్యనగరం

హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. గురవారం తెల్లవారు జాముల నుండి కురిసిన వర్షానికి నగరం తడిసి ముద్దయింది. భారీ వర్షంతో వర్షాకాలం మెదలయింది. నగరంలోని మాదాపూర్,జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, అమీర్ పేట్, ఎస్.ఆర్.నగర్, దిల్ షుఖ్ నగర్, ఉప్పల్, తార్నాకా లలో భారీ వర్షం పడింది. నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ వర్షం పడింది.  వర్షం దెబ్బకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి నీరు వచ్చిచేరింది. తెల్లవారు జామున మొదలైన వర్షం ఉదయం వరకు కొనసాగింది. రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం పూట నగరంలోకి వచ్చే బస్సులు, లారీలు నిర్ణీత సమయానికల్లా నగరంలోపలికి రాలేకపోయాయి. దీనితో ఉదయం మొదలయ్యే సాధారణ ట్రాఫిక్ కు ఇబ్బందులు తప్పలేదు.

పలు చోట్ల రోడ్లపై నీళ్లు నిల్చిపోవడంతో అధికారులు నీటిని తోడేస్తున్నారు. నీళ్లు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలక్కుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని చోట్ల ఇబ్బందులు తప్పడంలేదు.