ఈ కుంబ్లే మా కొద్దు…

టీం ఇండియా కోచ్ అనీల్ కుంబ్లెను మార్చాల్సిందేనని జట్టు సభ్యుల్లో అధికశాతం ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.  భారత క్రికెట్ జట్టు కోచ్ గా అనీల్ కుంబ్లే పదవీ కాలం జూన్ 20తో ముగుస్తోంది. కుంబ్లేతో తమకు వద్దని కొత్త కోచ్ ను నియమించాలంటూ ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లలో అధికశాతం కోరుకుంటున్నట్టు సమాచారం. కెప్టేన్ విరాట్ కోహ్లీ కూడా కోచ్ మార్చాలిందేనంటూ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. విరాట్ కే ఎక్కువ మంది జట్టు సభ్యులు మద్దతు పలుకుతున్నట్టు సమాచారం. ప్రస్తుత జట్టులోని 10 మంది ఆటగాళ్లు కోచ్ గా కుంబ్లేను మార్చాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. రవిశాస్త్రి నుండి కోచ్ గా పగ్గాలు స్వీకరించిన కుంబ్లే జట్టును విజయపథంలో నడపించారు. కుంబ్లే కోచ్ గా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు అక్కడ సిరీస్ ను కైవసం చేసుకుంది. అక్కడి నుండి కుంబ్లే కోచ్ గా జట్టు ప్రతీ సిరీస్ లోనూ విజయఢంకా మోగించింది. దీనితో కుంబ్లేనే భారత జట్టు కోచ్ గా రెండో ఏడాది కూడా కొనసాగడం ఖాయం అని అంతా భావిస్తున్న సమయంలో హఠాత్తుగా కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించడం సంచలనం రేపింది. కోచ్ కు కెప్టెన్ కు మధ్య వివాదాలు ముదిరిన నేపధ్యంలో కోహ్లీ ఒత్తిడి మేరకు కోచ్ ను మార్చాలనే నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా జట్టులోని ఆటగాళ్లలో అధికశాతం మంది కుంబ్లేను మార్చాల్సిందేనంటూ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.

ఆటగాళ్ల పట్ల కుంబ్లే చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడని అతన్ని తట్టుకోవడం తమ వల్ల కాదని జట్టు సభ్యులు అంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం కెప్టెన్ విరాట్ కోహ్లీ బోర్డు సభ్యులకు చెప్పగా తాజాగా జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా కుంబ్లేతో తాము వేగలేకపోతున్నామని ఆయన్ను తప్పించాల్సిందేనని అంటున్నట్టుగా సమాచారం. కోచ్ కోసం బీసీసీఐ ధరఖాస్తులను ఆహ్వానించగా కుంబ్లే కూడా ధరఖాస్తు చేసుకున్నాడు. కుంబ్లేతో పాటుగా మరో మాజీ క్రికెటర్ వీరేంద్ర సేహ్వాగ్ కూడా కోచ్ పదవి కోసం ధరఖాస్తు చేసుకున్నాడు.

Releated

టీ20 సిరీస్‌ రోహిత్‌ సేనదే..

నాగ్‌పూర్‌ : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత్‌ బంగ్లాపై 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో సొంత గడ్డపై భారత్‌ సీరీస్‌ను కైవసం చేసుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. దీపక్‌ చాహర్‌ దాటికి 19.2 ఓవర్లలో 144 పరుగులకే కుప్పకూలింది. 7పరుగులు ఇచ్చి 6వికెట్లు తీసిన చాహర్‌ అజంతా మెండిస్‌ రికార్డు(6\8) […]

కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ హాఫ్‌ సెంచరీలు

నాగ్‌పూర్‌: బంగ్లాతో జరుగుతున్న చివరి టీ20లో టీమిండియా యువ బ్యాట్స్‌మెన్‌ కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌లు హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో బంగ్లాకు టీమిండియా 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కేఎల్‌ రాహుల్‌ (52; 35 బంతుల్లో 7ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడగా.. అయ్యర్‌ (62; 33 బంతుల్లో 3 ఫోర్లు, 5సిక్సర్లు) బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో షఫీల్‌ ఇస్లామ్‌, […]